తిలక్‌ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్‌ గోవిందా! | Jamie Overton Breaks Tilak Varma's Wrist Watch In Half Days After Heated Face | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్‌ గోవిందా!

May 2 2026 10:39 PM | Updated on May 3 2026 10:50 AM

Jamie Overton Breaks Tilak Varma's Wrist Watch In Half Days After Heated Face

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ క్రికెట‌ర్ తిలక్ వ‌ర్మకు చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో సీఎస్కే బౌల‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ వేసిన బంతి తిల‌క్ వ‌ర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్క‌లు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్లో ఇది చోటుచేసుకుంది. ఓవ‌ర్ట‌న్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్ర‌మంలో తిల‌క్ వ‌ర్మ మిస్ చేశాడు. 

దీంతో బంతి తిల‌క్ వ‌ర్మ చేతికి బ‌లంగా తాకింది. నొప్పితో బాధ‌ప‌డిన తిల‌క్‌ను ఫిజియో వ‌చ్చి ప‌రిశీలించాడు. అదే స‌మ‌యంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్క‌లు కావ‌డం గ‌మ‌నార్హం. కాగా తిలక్‌వర్మ తన చేతికి ధరించిన రిస్ట్‌ వాచ్‌ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్‌ వర్మ మరోసారి విఫలమయ్యాడు. 

కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్‌ వర్మ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా.. రికెల్‌ట‌న్ 37 ప‌రుగులు చేశాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement