
లండన్: ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) సంప్రదాయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని... అందుకే టెస్టులకు నిరవధిక విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పాడు.
అయితే ఐదు రోజుల ఆటకు ఇది రిటైర్మెంట్ కాదు. 31 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్ ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. 2–2తో సమమైన ఆ సిరీస్‌లో అతను రెండు టెస్టులు ఆడాడు.
నాకిది ఇబ్బందికరం
‘కెరీర్ జోరుగా సాగిపోతున్న ఈ దశలో ఏడాదిలో 12 నెలలు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలంటే కుదరదు. అలా ప్రతీ ఫార్మాట్‌కు న్యాయం చేయలేను. శారీరకంగా, మానసికంగానూ నాకిది ఇబ్బందికరం. అందుకే బాగా ఆలోచించాకే టెస్టులకు విరామం ప్రకటిస్తున్నాను.
అప్పుడు నేను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టొచ్చు. సుదీర్ఘకాలం పాటు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ఓవర్టన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం
కాగా 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లోప ప్రయాణం మొదలుపెట్టిన ఓవర్టన్.. ఇప్పటివరకు ఓవర్టన్ కేవలం 6 వన్డేలు, 12 టీ20లే ఆడాడు. ఐపీఎల్‌లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇక లండన్‌లో ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ఆడాడు. ఓవర్టన్ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నాడు.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర