సాక్షి, హైదరాబాద్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో అండర్–19 బాలుర విభాగంలో సుహాస్ ప్రీతమ్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. సుహాస్ 2 నిమిషాల 06.28 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
కేరళ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ మొంగం తీర్థు సామ (2ని:11.24 సెకన్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్–19 బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో తెలంగాణకు చెందిన ధూళిపూడి వర్షిత్ (4ని:40.41 సెకన్లు) రజత పతకం సంపాదించాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొంగం తీర్థు సామ (4ని:39.85 సెకన్లు) స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అండర్–17 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తెలంగాణకు చెందిన ఇషాన్ దాస్ (25.93 సెకన్లు) రజతం, గౌతమ్ శశివర్ధన్ (26.25 సెకన్లు) కాంస్యం సాధించారు.


