సాక్షి, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్వచింతల్‌లో బండారి రవీందర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి వరకు భార్య కోసం ప్రచారం చేసిన రవీందర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గెలుపుపై ఆందోళనతో ఆత్మహత్యా? లేక మరో కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, అతడి ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన అవ శేఖర్(25) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి ఇటీవలే పంచాయతీ ఎన్నికల సందర్బంగా తన గ్రామంలో వార్డు మెంటర్‌గా పోటీ చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో అతడిని ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలనే బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.


