బాలయ్య మూవీ అఖండ-2 సినిమా టికెట్ల పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఏపీలో భారీగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 ఒక్కో టికెట్‌పై పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 4న ప్రదర్శించే ప్రీమియర్స్‌కు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ ఒక్క షోకు ఏకంగా రూ.600 వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా ఇష్టమొచ్చినట్లుగా టికెట్ ధరలకు అనుమతులు ఇవ్వడంపై సగటు సినీ ప్రియులు మండిపడుతున్నారు.

ఏపీలో భారీగా ధరల పెంపు..
ఏపీలో ఇప్పటికే అఖండ-2 మూవీ టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. సింగిల్స్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. ఏకంగా రూ.600 లుగా టికెట్ ధరలను నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సగటు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


