నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తి అయింది. దీంతో మొదటి పెళ్లిరోజును ఈ జంట చేసుకుంటుంది. ఈ సందర్భంగా తన పెళ్లి నాటి ప్రత్యేకమైన వీడియోను ఫ్యాన్స్‌తో శోభిత పంచుకున్నారు. చైతన్యలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని, తన జీవితంలోకి చైతూ వచ్చాకే పరిపూర్ణమైందని ఆమె అన్నారు.
2024 డిసెంబర్ 4న హిందూ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య (Naga Chaitanya) - శోభిత (Sobhita Dhulipala) వివాహం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుక ఇండస్ట్రీకి చెందిన అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత జీవితంతో పాటు తన భర్త నాగచైతన్య గురించి ఇప్పటికే ఆమె పలు విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
అయితే, నేడు వారిద్దరూ మొదటి ఏడాది పెళ్లిరోజును జరుపుకుంటున్న సందర్బంగా ఆమె ఇలా అన్నారు. తాను ఎంతో ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేసి ఏడాది పూర్తి అయిందని శోభిత తెలిపారు. నాగచైతన్య తన లైఫ్‌లోకి వచ్చాకే జీవితం పరిపూర్ణమైందని అమె అన్నారు. అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్లుగా.. శ్రీమతిగా ఒక సంవత్సరం పూర్తి అయిందని ప్రత్యేకమైన వీడియోతో శోభిత పంచుకున్నారు.


