భర్తపై ఫేక్‌ న్యూస్‌.. రకుల్‌ ప్రీత్‌ ఏమన్నారంటే.. | Rakul Preet Singh Response On Rumours About Her Husband Jackky Bhagnani | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: భర్తపై ఫేక్‌ న్యూస్‌.. రకుల్‌ ప్రీత్‌ ఏమన్నారంటే..

Dec 4 2025 12:27 PM | Updated on Dec 4 2025 12:47 PM

Rakul Preet Singh Response On Rumours About Her Husband Jackky Bhagnani

సినిమావాళ్లపై గాసిప్స్‌ కామన్‌. కెరీర్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌పై కూడా రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. చాలామంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ లిస్ట్‌లోకి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా వస్తుంది. క్లిక్స్‌ కోసం రాసే వార్తలపై స్పదించాల్సిన అవసరం లేదంటోంది ఈ టాలీవుడ్‌ బ్యూటీ. 

ఇటీవల రకుల్‌(Rakul Preet Singh) భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani) సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఆయన నిర్మించిన ‘బ‌డే మియా.. ఛోటే మియా’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడనని.. కంపెనీ మూసేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రకుల్‌ స్పందించింది. ‘ఆర్థికంగా నష్టపోయిన సంగతి నిజమే కానీ..కంపెనీ మూసేశారనడం పచ్చి అబద్ధం అన్నారు. క్లిక్స్‌ కోసం కొందరు తప్పుడు వార్తలు రాస్తుంటారని.. వాటిని పట్టించుకోబోమని చెప్పారు.

 ‘క్లిక్స్‌ కోసం ఏమైనా రాసేవాళ్లు ఉన్నారు. ఆ వార్తల్లో ఒక్కశాతం కూడా నిజం ఉండదు. అసలు నిజమేంటో నాకు తెలుసు కాబట్టి..అలాంటి వార్తలను పట్టించుకోను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల మౌనంగా ఉండడమే బెటర్‌. సమయం వచ్చినప్పుడు నిజానిజాలు ఏంటో ప్రేక్షకులకు తెలుస్తాయి. 

జాకీ భగ్నానీపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు.. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నేను దగ్గర నుంచి చూశాను. కంపెనీ మూసేశారని రాశారు. అతడు నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆర్థికంగా చాలా నష్టం కలిగింది. కానీ, కంపెనీ మూసివేయలేదు. ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాతకు అప్పుడప్పుడు  అలా జరుగుతుంది. ఒకనొక సమయంలో అమితాబ్‌బచ్చన్‌కు కూడా ఇలానే జరిగింది. ఎదిగేక్రమంలో ఇలాంటి ఒడుదొడుకులు సహజం. వాటిని తట్టుకొని నిలబడితేనే విజయం వరిస్తుంది’ అని రకుల్‌ చెప్పుకొచ్చింది.

కాగా, రూ. 400 భారీ బడ్జెట్‌తో జాకీ భగ్నానీ నిర్మించిన  ‘బ‌డే మియా.. ఛోటే మియా’ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి..డిజాస్టర్‌గా నిలిచింది. అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ లాంటి స్టార్స్‌ నటించిన చిత్రం అయినప్పటికీ.. కనీస ఓపెనింగ్స్‌ రాబట్టలేకపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement