పెళ్లి వార్తల గురించి నటి రష్మిక స్పందించారు. విజయ్ దేవరకొండతో ఇప్పటికే నిశ్చతార్థం కూడా చేసుకున్నట్లు బలంగానే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వారిద్దరూ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తన పెల్లి గురించి వస్తున్న రూమర్స్‌ను ఖండించలేనని అంటూనే ఆ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేనని అన్నారు. అయితే, పెళ్లి గురించి తప్పకుండా సరైన సమయం, ప్రదేశంలో మాట్లాడుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు. ఇంతకు మించి పెళ్లి గురించి చెప్పలేనని రష్మిక పేర్కొన్నారు.
తన వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి చెప్పేందుకు పెద్దగా ఇష్టపడనని రష్మిక అన్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోనన్నారు. అదే విధంగా బయటకు వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనన్నారు. ఈ ఏడాది తన జీవితంలో చాలా ఎంతో ప్రత్యేకమైనదని ఆమె అన్నారు. 2025లో తాను నటించిన ఐదు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి మంది ఆదరణ పొందడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు.


