టికెట్ టు ఫినాలే కోసం హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. తనూజ.. సుమన్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోవడంతో మొన్నటి ఎపిసోడ్ ముగిసింది. మరి తర్వాతేం జరిగింది? ఎవరు గెలిచారు? మళ్లీ ఎలాంటి గేమ్స్ పెట్టారనేది బుధవారం (డిసెంబర్ 3వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...
సుమన్ చేతిలో ఓటమి
తనూజ, సుమన్‌కు బిగ్‌బాస్ వాటర్ ట్యాంక్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కల్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్.. తనూజకు సపోర్ట్ చేశారు. భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ట్యాంకు సగానికి పైగా నిండినా సరే సుమన్ కదలకుండా శిలావిగ్రహంలా నిల్చుని గెలిచాడు. టికెట్ టు ఫినాలే రేసు నుంచి అవుట్ అయిపోవడంతో తనూజ ఏడ్చేసింది.

గెలిచిన పవన్
తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ బాక్స్ అనే ఛాలెంజ్‌ను కల్యాణ్, పవన్, సుమన్ ఆడారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచి భరణిని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరికీ వారధి కట్టు- విజయం పట్టు అనే బ్రిడ్జి టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పవన్‌పై భరణి గెలిచేశాడు. దీంతో పవన్ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయాడు.
మాట నిలబెట్టుకోలేని పవన్
ఈసారి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే అని ఛాలెంజ్ చేసిన పవన్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయేసరికి బాధపడ్డాడు. ప్రస్తుతానికి రీతూ, భరణి, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సుమన్ టికెట్ టు ఫినాలే రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో చూడాలి!


