ఉత్తరప్రదేశ్ కుంభమేళా ఫేమ్ మోనాలిసా హీరోయిన్‌గా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘లైఫ్’. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిచరణ్ హీరోగా నటిస్తున్నారు. వెంగమాంబ క్రియేషన్స్‌పై అంజన్న నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయింది.
‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో ‘లైఫ్’ రూపొందుతోంది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. సాయాజీ షిండే, సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: సుకుమార్.


