వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, రచయిత అయిన రాబర్ట్ కియోసాకి.. పలు సందర్భాల్లో ధనవంతులవ్వాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?, డబ్బు కూడబెడితే జరిగే నష్టం ఏమిటి? అనే చాలా విషయాలను వెల్లడించారు. ఇప్పుడు తాజాగా జీవితాన్ని మార్చుకోవాలంటే ఏమి చేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎవరితో గడుపుతున్నారు?
మీ జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం.. మీరు పనిచేసే లేదా మీ చుట్టూ ఉన్న మనుషులను మార్చేయడమే అని పేర్కొన్నారు. కుటుంబంతో కాకుండా మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారు? అని ప్రశ్నిస్తూ మూడు (ధనవంతులు?, మిడిల్ క్లాస్?, పేదవాళ్లు?) ఆప్షన్స్ ఇచ్చారు.
మీరు ధనవంతులు అవ్వాలంటే.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్లతో ఎక్కువ సమయం గడపండి. ఒక ఉద్యోగం చేసేవ్యక్తి.. మరికొంతమంది ఉద్యోగులతో కలిసి ఉంటే.. దాదాపు ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలే చేస్తారు. వారు పెట్టుబడికి సంబంధించిన విషయాలు, డబ్బు సంపాదించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించరు.
ఎలాంటివాళ్ల దగ్గర సమయం గడిపితే..
ఒక ధనవంతుడు.. డబ్బు, పెట్టుబడి, వ్యవస్థాపకత వంటి విషయాల గురించి ఆలోచిస్తాడు. వారు ధనవంతులవ్వడానికి.. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. నేను నిరంతరం సెమినార్లకు హాజరవుతున్నాను. డబ్బు, వ్యవస్థాపకత, పెట్టుబడిపై సెమినార్లలో నేను భాగస్వాములను కలుస్తాను అని కియోసాకి పేర్కొన్నారు. కాబట్టి ఈ రోజు కెన్ మెక్‌ఎల్‌రాయ్ వంటి నా స్నేహితులు చాలా మంది లిమిలెస్ & ది కలెక్టివ్ వంటి అత్యుత్తమ సెమినార్లలో పాల్గొంటున్నారు. మీరు ఎలాంటివాళ్ల దగ్గర సమయం గడిపితే.. మీకు అలాంటి ఆలోచనలే వస్తాయని కియోసాకి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి
మీతో ఉన్న ఐదుమంది స్నేహితులు ఆర్ధిక సెమినార్లకు హాజరవుతున్నారా? లేక ఉద్యోగులుగా ఉండటానికి అడ్వాన్స్ డిగ్రీల కోసం కాలేజీకి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. చివరగా ''గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చడానికి వేగవంతమైన మార్గం మీ విద్యను, తరువాత మీ స్నేహితులను మార్చడమే'' అని అన్నారు.
BIRDS of a FEATHER do FLOCK TOGETHER
There is a lot of truth and wisdom in that ancient saying.
One way to change your life is to change the people you work with and friends you hang with.
Quick Rich Dad test:
Are the 5 people you spend the most time with…. Outside your…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025


