వెండి ధర మళ్లీ రికార్డ్ యిలో ఎగిసింది. భారత్‌లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్‌కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.
‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.
SILVER To Break $80.
Happy New Year ….smart silver stackers.
Your patience has paid off.
Now we get richer.
Happy 2026
Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025


