2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే! | four big investment themes for 2026 check list | Sakshi
Sakshi News home page

2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!

Dec 27 2025 6:23 PM | Updated on Dec 27 2025 7:45 PM

four big investment themes for 2026 check list

2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్‌కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.

కృత్రిమ మేధ

భారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్‌’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.

ఈవీ చార్జింగ్ సదుపాయాలు

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.

ఆఫీస్ వర్క్‌స్పేస్

భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్‌గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

లగ్జరీ, ప్రీమియం వస్తువులు

పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.

ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌.. గిగ్‌ వర్కర్ల సమస్యలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement