గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో.. 83,674.92 వద్ద, నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, క్రౌన్ లిఫ్టర్స్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్, యూనిటెక్ లిమిటెడ్, కిలిచ్ డ్రగ్స్(ఐ) లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


