కొత్త మార్క్‌కు సిల్వర్!: కియోసాకి ట్వీట్ | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About Silver Breaks | Sakshi
Sakshi News home page

నిన్న మస్క్.. నేడు కియోసాకి: సిల్వర్ రేటుపై ట్వీట్స్

Dec 29 2025 2:55 PM | Updated on Dec 29 2025 3:48 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About Silver Breaks

వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.

బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో వెండి రేటు
హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.

వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్
వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.

చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement