కిలో రూ. 2.41 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి ధరలు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిని తాకాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ. 1,000 పెరిగి రూ. 2.41 లక్షలకు చేరింది. అయితే బంగారం ధర వరుసగా రెండో రోజున క్షీణించింది.
99.9%స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 2,800 తగ్గి రూ. 1,39,000కు పరిమితమైంది. ఎంసీఎక్స్ లో మార్చి వెండి కాంట్రాక్టు రూ. 9,590 పెరిగి రూ. 2,34,019 పలికింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో సిల్వర్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 3.72 డాలర్లు పెరిగి 75.85 డాలర్లకు చేరింది. బంగారం సైతం ఔన్సుకి 69.61 డాలర్లు పెరిగి 4,401.59 డాలర్లు పలికింది.


