వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.
వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.
వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..
1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.
‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..
Silver is over $70 USD an ounce.
Q: IS IT TOO LATE TO BUY SILVER?
A: It depends.
If you think silver is at an all time high then you’re too late.
I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.
There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025


