ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం.. | Sushmita Sen And Rani Mukerji Are Registering For Fast Track Immigration | Sakshi
Sakshi News home page

Fast Track Immigration: ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..

Dec 30 2025 6:25 PM | Updated on Dec 30 2025 8:00 PM

Sushmita Sen And Rani Mukerji Are Registering For Fast Track Immigration

భారత ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)ని ప్రారంభించింది. ఈ విధానంతో విమానం మిస్సవుతుందనే భయం లేకుండా నిశ్చింతగా విదేశాలు చుట్టొచ్చేయొచ్చు. అంతేగాదు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడకుండా ఈజీగా ఇమిగ్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇది ప్రముఖుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది కూడా. అందుకు నిదర్శనం బాలీవుడ్‌ తారలు సుస్మితా సేన్, రాణి ముఖర్జీలు ఈ చొరవకు సైన్‌అప్‌ చేయడమే. ఆ విషయాన్ని స్వయంగా బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. 

ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రక్రియలో తమ పేర్లను నమోదు చేసుకున్న వీడియోలను షేర్‌ చేసింది కూడా. ఒక వీడియో క్లిప్‌లో రాణి ముఖర్జీ తన బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానికి ‍క్యాప్షన్‌గా  "మర్దానీ శివానీ శివాజీ రాయ్ ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌లో నమోదు చేసుకున్నప్పుడూ దేశం కూడా అనుసరిస్తుంది" అని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. ఇక మరో వీడియో క్లిప్‌లో సుస్మితా సేన్ బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేస్తున్నట్లుగా షేర్‌ చేస్తూ.."సుష్మితా సేన్ క్యూను స్కిప్‌ చేయాలనుకుంటోంది.. మరి మీరు" అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. వీళ్లంతా ఎందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ ఇమ్మిగ్రేషన్‌ కోసం నమోదు చేసుకుంటున్నారు? దీనికి ఎవరు అర్హులు?  తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!

FTI-TTP అంటే ఏమిటి?
ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ (FTI-TTP) అంతర్జాతీయ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సులభతరం చేయడమే దీని ప్రధానోద్దేశ్యం. క్యూలైన్లలో పడిగాపులు పడకుండా తక్కువ సమయంలో ఇమ్మిగ్రేషన్‌ పాలసీ ప్రకియను పూర్తి చేసేలా ఈ ప్రక్రియ అనుమతిస్తుంది. ఇది 2024లో ప్రారంభమైంది. జస్ట్‌ 30 సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు అనుమతిస్తుంది. విమానాశ్రయంలో నిరీక్షించాల్సిన పని ఉండదు, అలగే తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. 

 

ఎలా అంటే..

FTI-TTP కింద నమోదు చేసుకున్న ప్రయాణీకులు సాధారణ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద లైన్‌లో నుంచోవాల్సిన పని ఉండదు. సంబంధిత విమానాశ్రయాల్లో 

వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్‌ల వద్దకు వెళ్లాలి. 

మొదటి గేట్‌ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్‌ పాస్‌ స్కానింగ్‌ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది.

రెండో ఈ–గేట్‌ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్‌ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది

 

ఎవరు అర్హులు?
భారతీయ పౌరులు
భారతదేశ విదేశీ పౌరసత్వం (OCI) కార్డులు కలిగి ఉన్న విదేశీ పౌరులు
పాస్‌పోర్ట్‌ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి.
ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా పూర్తి అయితే ఐదేళ్లు లేదా పాస్‌పోర్ట్ గడువు ముగిసే వరకు ఇది చెల్లుబాటవ్వుతుంది. అలాగే ఇది ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

దరఖాస్తు ప్రక్రియ ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అనుసరించడం సులభం.

ఆన్‌లైన్ దరఖాస్తు: ftittp.mha.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించి ఇటీవలి పాస్‌పోర్ట్-సైజ్‌ ఫోటో, స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ పేజీలు, నిర్థారిత అడ్రస్‌,  OCI కార్డ్ (వర్తిస్తే) అప్‌లోడ్ చేయాలి.

ఆ తర్వాత అధికారులు సమర్పించిన వివరాలను ధృవీకరిస్తారు. క్లియర్ అయిన తర్వాత దరఖాస్తుదారులకు ఇమెయిల్ లేదా SMS ద్వారా సమాచారం అందిస్తారు.

బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్: FRRO కార్యాలయంలో లేదా నియమించబడిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అపాయింట్‌మెంట్ సమయంలోనే వేలిముద్రలు, ముఖ డేటాని నమోదు చేసుకోవాలి.  అయితే తుది ఆమోదం ఒక నెల వరకు పట్టవచ్చు.

ఎందుకు తిరస్కరింపబడతాయంటే..

తప్పుగా లేదా తప్పుడు సమాచారం

ముఖ్యమైన వివరాలను దాచడం

అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్న పత్రాలు లేదా ఫోటోలు

తప్పుగా లేదా తప్పుడు అడ్రస్‌ 

చివరగా దరఖాస్తుదారులు దరఖాస్తును సమర్పించిన తర్వాత ఈమెయిల్ లేదా  SMS ద్వారా రసీదును అందుకుంటారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించబడితే, సమస్యలను సరిదిద్దిన తర్వాత వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.

(చదవండి: 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement