రోడ్డు  ఎలా వేస్తారు? పెద్ద తతంగమే! | How Roads Are Built, From Planning To Paving A Step By Step Guide For Kids, Read Story Inside | Sakshi
Sakshi News home page

రోడ్డు  ఎలా వేస్తారు? పెద్ద తతంగమే!

Feb 14 2026 5:17 PM | Updated on Feb 14 2026 5:22 PM

Do you know How Roads Are Built Process Explained

పిల్లలూ! మీరు రోజూ స్కూల్‌కి వెళ్లడానికి, తిరిగి ఇంటికి రావడానికి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు కదా! మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో  ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న రకరకాల రవాణా మార్గాల్లో రోడ్లు అత్యంత కీలకమైనవి. మన దేశంలో ఇంకా రోడ్డు లేని అనేక ప్రాంతాలున్నాయి. అక్కడి మనుషులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంత కీలకమైన రోడ్డు ఎలా వేస్తారో మీకు తెలుసా?

రోడ్డు నిర్మాణానికి ముందుగా కావాల్సింది ప్రణాళిక (ప్లానింగ్‌). ఆ రోడ్డు ఏయే  ప్రాంతాలను కలుపుతుంది, ఆ రోడ్డు విస్తీర్ణం ఎంత,  రోడ్డు వేసే నేల స్వభావం ఎలాంటిది వంటి అంశాలను ఇంజినీర్లు పరిశీలించి ఓ ప్రణాళిక రూపొందిస్తారు. అనంతరం  సర్వే చేపడతారు. ఆపైన మట్టి పని మొదలవుతుంది.

ఎగుడుదిగుడుగా ఉండే దారిని చదునుగా చేస్తారు. లోతట్టుగా ఉండే  ప్రాంతంలో బయట నుంచి మట్టి తెప్పించి పోస్తారు. అప్పుడే రోడ్డు వేయడం వీలవుతుంది. అనంతరం రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సైడు కాల్వలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు లేకపోతే వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అనంతరం రాళ్లు, కంకరను పొరలు  పొరలుగా ఆ భూమిపై వేసి రోడ్‌ రోలర్లతో బాగా నొక్కుతారు. దీంతో ఆ ప్రాంతం రోడ్డు వేసేందుకు సిద్ధమవుతుంది. చివరిగా తారు లేదా కాంక్రీట్‌ మిశ్రమాన్ని వేసి రోడ్డుకు చివరి రూపు ఇస్తారు. అలా రోడ్డు సిద్ధమవుతుంది.  

ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement