టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా? | Did You Know? Many Common Vegetables In India, Like Tomato, Potato, And Chili, Originated From Foreign Lands | Sakshi
Sakshi News home page

టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?

Feb 14 2026 5:08 PM | Updated on Feb 14 2026 5:11 PM

Vegetable interesting facts where Tomatoes originated

రోజు మీ భోజనంలో రకరకాల కూరగాయలను భాగంగా చేసుకుంటారు. అవన్నీ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని కూరగాయలు విదేశాల నుంచి వచ్చాయన్న విషయం మీకు తెలుసా?

టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి వంటి కూరగాయలు విదేశాల నుండి భారతదేశానికి వచ్చాయి. 16–17 శతాబ్దాలలో పోర్చుగీస్, బ్రిటీష్‌ వారి ద్వారా ఇవి మన దేశానికి చేరుకున్నాయి. చివరకు ఇవి మన వంటల్లో ముఖ్యమైన పాత్ర షోషించడం మొదలైంది. ఇందులో ముఖ్యమైనది టమాటా. ఇది మెక్సికో నుండి పోర్చుగీస్‌ వ్యాపారుల ద్వారా మనకు పరిచయమైంది. ఆ తర్వాత బంగాళదుంప (ఆలూ). ఇది పెరువియన్‌-బొలీవియన్‌ ఆండీస్‌ (దక్షిణ అమెరికా) నుండి మన దేశానికి వచ్చింది. పచ్చిమిర్చి. 

ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

ఇది దక్షిణ అమెరికా మూలాలు కలిగినది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ కూడా ఆఫ్రికా, మెడిటరేనియన్‌ ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చినట్లు భావిస్తుంటారు. బీట్‌రూట్‌ అనేది యూరప్, ఈజిప్టు ప్రాంతాల నుంచి వచ్చింది. 

వీటితోపాటు బ్రోకలీ, లెట్యూస్, ఆస్పరాగస్, స్వీట్‌ కార్న్‌ వంటివి కూడా విదేశీ రకాలుగా పరిగణిస్తారు.   

ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ను చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement