టొరంటో: పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ కెనడా పౌరుడు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత వీసా పొందినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.
సోషల్ మీడియాలో తనను తాను ఫారెక్స్ ట్రేడర్‌గా పరిచయం చేసుకునే అభయ్‌కు ఒక నెల కాలపరిమితి కలిగిన సింగిల్ ఎంట్రీ భారత వీసా మంజూరైంది. ఈ సందర్భంగా అతడు వీసా దరఖాస్తు ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో వివరించాడు.
“నేను కెనడా పౌరుడిని. ప్రస్తుతం పాకిస్తాన్‌లో నివసించడం లేదు. అయినప్పటికీ, పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తినన్న కారణంతో భారత వీసా ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. దానికి గల కారణాలు నాకు పూర్తిగా తెలియవు” అని అభయ్ పేర్కొన్నారు.
అయితే, ఎట్టకేలకు వీసా లభించడంతో సంతోషం వ్యక్తం చేసిన అతడు, భారత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనకు లభించిన ఈ అవకాశం ఎంతో విలువైనదని పేర్కొన్నాడు.


