యూఏఈపై డ్రోన్ల దాడి.. పదుల సంఖ్యలో గాయాలు | United Arab Emirates Under Massive Drone Assault, 78 Injured After Strikes Linked To Iran | Sakshi
Sakshi News home page

యూఏఈపై డ్రోన్ల దాడి.. పదుల సంఖ్యలో గాయాలు

Mar 4 2026 5:56 PM | Updated on Mar 4 2026 6:07 PM

Iranian drone attack on UAE

UAEపై గడిచిన కొద్ది గంటల్లో 129 డ్రోన్‌ అటాక్స్ జరిగినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు ప్రకటించాయి. వాటితో పాటు నాలుగు బాలిస్టిక్ మిసైల్స్ దాడి జరిగినట్లు ఆ దేశం ప్రకటించింది.  ఈ దాడులలో  ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని 78 మందికి గాయాలైనట్లు తెలిపింది. 

అమెరికాపై కోపంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలపై విరుచుకపడుతుంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తుంది. అయితే దాడులలో రక్షణ స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాలపైనా దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై గడిచిన కొన్ని గంటల్లో 129 డ్రోన్‌ అటాక్స్ జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. అయితే ఆ డ్రోన్లను చాలా మాట్టుకు గాలిలోనే కూల్చివేశామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. 

ఈ దాడులలో 78 మంది ప్రజలు  గాయపడ్డారని  వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. క్షతగాత్రులలో  వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నట్లు సమాచారం. వారిలో భారతీయులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు యుఎఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలెవ్వలరూ ఇండ్లనుంచి బయిటకి రావొద్దని కిటీకిల నుంచి దూరంగా ఉండాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement