వరల్డ్‌ ఫిలాసఫీ డే : ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ | World Philosophy Day 2025 importance and interesting facts | Sakshi
Sakshi News home page

World Philosophy Day ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Nov 20 2025 12:48 PM | Updated on Nov 20 2025 12:59 PM

World Philosophy Day 2025 importance and interesting facts

World Philosophy Day 2025 ప్రతి సంవత్సరం నవంబర్‌ మూడో గురువారం ప్రపంచ తాత్వికతా దినం జరుపుకొంటున్నాం. ప్రపంచ పౌరులు వారి వారి సంస్కృతుల్లోంచి పైకి ఎదిగి ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచించి, మానవుడి ఔన్నత్యాన్నిమరింతగా పెంపొందించుకోవడానికీ, దాని ప్రకారం తమ తమ సమాజాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికీ దీన్ని ఆచరిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న భిన్నమైన మే«ధా సంపత్తిలో ఒక ఏకత్వాన్ని సాధించుకోవలసి ఉందని గుర్తు చేసుకోవడం కోసం ఈ రోజు ముఖ్యోద్దేశం. హేతుబద్ధమైన చర్చలతో, సంప్రదింపులతో నిజాయతీని, త్యాగనిరతిని, బాధ్యతని, ఓపికగా మానవుడే కేంద్రంగా సాగవల్సిన ప్రయాణానికీ ఒక తాత్విక భూమికను ఏర్పరచుకోవాల్సిఉందని ఈ రోజు మనకు గుర్తుచేస్తోంది.

మనిషికి వివేకంపై గల ప్రేమనే మనం తాత్వికత / ఫిలాసఫీ అని అను కోవచ్చు. విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే జనం తమ గురించి, తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, వారి మధ్యగల సంబంధం గురించి కొన్ని మౌలిక సత్యా లను అర్థం చేసుకుని, రూపొందించుకునే జీవన విధానమే తాత్వికత! మళ్ళీ ఈ తాత్వికత అనేక రకాలుగా ఉంటుంది. సిద్ధాంతబద్ధమైన తాత్వికత (మెటాఫిజిక్స్‌ /ఎపిస్టిమాలజీ), య«థార్థం లోంచి వెలువడ్డ తాత్వికత- అంటే నైతిక, సామాజిక, రాజకీయ, సౌందర్య భావన వంటి అంశాలతో కూడిన తాత్వికత. ఇకపోతే వ్యక్తిగతమైన విశ్వాసాలు, జీవితాంతం నిలుపుకొనే విలు వలూ, ఆచరించే నైతిక సూత్రాలనూ బట్టి అది వారి వారి వ్యక్తిగత తాత్వికత అవుతుంది. అది మెరుగైనదై ఉండి, ఇతరులకు స్ఫూర్తిదాయకమైనప్పుడు– అదే ఒక ప్రాంతంలోని సమాజం ఆచరిస్తే అది సమాజ తాత్వికత అవుతుంది. అదే దేశం అనుసరిస్తే అది ఆ దేశపు తాత్వికత అవుతుంది. ఏమైనా చివరికి మానవాళికి మనిషి కేంద్రంగా ఒక ఉమ్మడి తాత్విక భూమిక అవసరం!

ఇదీ చదవండి: H-1B వీసాలు ట్రంప్‌ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు

తాత్విక దృక్పథం ఎప్పుడూ గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ఉప యోగపడాలి. ఎదురయ్యే సవాళ్ళను సంయమనంతో ఎదుర్కోగలిగే శక్తిని కూడా అందజేయాలి. దీనిలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావల్సిందే. తమ వంతు బాధ్యతను నిర్వహించాల్సిందే. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. కానీ, ఆ భాషల్లో తాత్విక దృక్పథం లేకపోతే అవి బీడు భూములైపోతాయి. అందులో పచ్చని జీవన తాత్వికతను మొలిపించు కోవాలి. ‘మనుషులంతా ఒక్కటి’ అని నినదించక తప్పదు. మారుతున్న పరిస్థి తులను గమనిస్తూ, అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోటా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాల్సి ఉంది. 
– ప్రొ.దేవరాజు మహారాజు మానవవాది, జీవశాస్త్రవేత్త
(నేడు వరల్డ్‌ ఫిలాసఫీ డే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement