ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లే భారత పౌరులు అత్యవసరమైతే తప్ప ఆదేశానికి వెళ్లకూడదని సూచించింది. ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేసింది.
ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్‌లో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరడంతో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, కఠినఆంక్షలు విధించడం తదితర చర్యలు చేపట్టారు. ఈ నిరసనల్లో బలగాల కాల్పుల్లో దాదాపు 15మందికి పైగా మృతిచెందారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇరాన్‌లో జరుగుతుంది నిశితంగా గమనిస్తున్నాం. గతంలో మాదిరి అమాయకులను చంపితే అమెరికా జోక్యం చేసుకుంటుంది. అని అన్నారు. దీంతో మరోసారి ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ స్పందించింది. భారతీయులు అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు వెళ్లకూడదని తెలిపింది. అదేవిధంగా ఆదేశంలో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
అదే విధంగా భారత ఎంబసీకి సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అందుకు ఎంబసీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఫాలో కావాలని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్‌లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో అధికశాతం మంది విద్యార్థులే.


