అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత భారత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు భారీ ఎదురుదెబ్బ గిలింది. 2025 ఆర్థిక సంవత్సరంలో H-1B వీసా దరఖాస్తులను భారతీయ కంపెనీలు గణనీయంగా తగ్గించేశాయి. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గాయి. మరోవైపు ఈ పరిణామం అమెరికా ఉద్యోగులను నియామకాలకు దారి తీస్తోంది. శరవేగంగా మారుతున్న సాంకేతిక మార్పులు, భారతదేశం నుండి రిమోట్‌గా ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యం పెరుగుదలను ప్రతిబింబిస్తుందని నిపుణులు తెలిపారు.
గత దశాబ్ద కాలంతో పోలిసతే ఇది మరింత తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది; టాప్ ఏడు భారతీయ సంస్థలు H-1B అప్లికేషన్స్‌ను 70శాతం తగ్గించాయి. 2025లో, కేవలం 4,573 ప్రారంభ ఉపాధి (initial employment) ఆమోదాలను మాత్రమే పొందారు.
అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు H-1B వినియోగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. USCIS డేటా NFAP విశ్లేషణ ప్రకారం, అమెజాన్ 4,644 ప్రారంభ ఆమోదాలతో టాప్‌లో ఉండగా, మెటా (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగు అమెరికన్ టెక్ కంపెనీలు తొలి నాలుగు స్థానాలను ఆక్రమించడం ఇదే మొదటిసారి.
భారతీయ ఐటీ సంస్థలు టాప్ నుంచి కిందికి పడిపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మొత్తం మీద ఐదో స్థానంలో నిలిచింది, కానీ LTIMindtree (20వ స్థానం), HCL అమెరికా (21వ స్థానం) టాప్ 25లో చోటు దక్కించుకోలేకపోయాయి. దీనికి ఐటీలో నిర్మాణాత్మక మార్పులు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆన్‌షోర్ ఉద్యోగులు ,రిమోట్ ఎగ్జిక్యూషన్ మోడల్‌లపై సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయన్నారు. ట్రంప్ కొత్త వీసావిధానం, ప్రతీ కొత్త H-1B కోసం 100,000 డాలర్ల ఫీజు లాంటి వాటికారణంగా కంపెనీల దృక్పథంలో మరింత మార్పువస్తుందని భావిస్తున్నారు.
అత్యధిక H-1B వీసాలు ఇక్కడే
ఇనీషియల్ ఎంప్లాయ్‌మెంట్ కోసం 21,559 దరఖాస్తులతో H-1B వీసాల ఆమోదాల జాబితాలో కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది, తరువాత టెక్సాస్ (12,613), న్యూయార్క్ (11,436), న్యూజెర్సీ (7,729), వర్జీనియా (7,579) ఉన్నాయి.
న్యూయార్క్ నగరం అత్యధిక సంఖ్యలో కొత్త ఆమోదాలను (7,811) నమోదు చేసింది, ఆర్లింగ్టన్, చికాగో, శాన్ జోస్, శాంటా క్లారా, శాన్ఫ్రాన్సిస్కో కూడా ప్రముఖ నగరాలుగా ఉన్నాయి. ప్రొఫెషనల్ , టెక్నికల్ సర్వీసెస్, విద్య, తయారీ, సమాచారం, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ వంటి రంగాలలో H-1B వీసాలకు ప్రాధాన్యత లభించింది.


