వాషింగ్టన్: అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్‌ఫెక్ట్‌గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్‌స్ట్రీట్ జర్నల్స్‌కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయిటపెట్టారు.
డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్దిరోజులు కనబడపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. "నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను" అని వివరణ ఇవ్వడంతో అప్పట్లో అంతా సైలంట్ అయ్యారు.
అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " నా ఆరోగ్యంపై మాట్లాడడం ఇది 25వసారి. గత 25 ఏళ్లుగా ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా. డాక్టర్లు 81mg తీసుకోమని చెబితే, నేను 325mg తీసుకుంటున్నాను. రక్తాన్ని పలుచగా చేయడంలో అంది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నా గుండెలో చిక్కటి రక్తం వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు.
వైట్‌హౌస్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమాలలో తాను వినడానికి ఇబ్బందులు పడుతున్నానని, తరచుగా నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి చర్చించడం తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తోందదన్నారు.. అయితే తనకు వ్యాయామం అంటే అస్సలు నచ్చదని ట్రెడ్‌మిల్‌పై నడవడం, పరిగెత్తడం చాలా బోరింగ్‌గా ఉంటుందని తెలిపారు. తన చేతులపై ఇప్పుడు కొన్ని గాయాలున్నాయని వాటికి 10 నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని వాల్ స్ట్రీట్స్ జనరల్‌కిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ అదే పెద్దవయస్సు, అయితే 78 సంవత్సరాల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జో బైడెన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు.


