ఎలాంటి మార్పులు ఉండ‌వు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది: ట్రంప్‌ | Trump says India trade deal intact after Supreme Court ruling | Sakshi
Sakshi News home page

ఎలాంటి మార్పులు ఉండ‌వు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది: ట్రంప్‌

Feb 21 2026 5:00 AM | Updated on Feb 21 2026 7:10 AM

Trump says India trade deal intact after Supreme Court ruling

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గ్లోబ‌ల్ టారిఫ్‌ల‌ విషయంలో గ‌ట్టి ఎదురు దెబ్బత‌గిలిన సంగ‌తి తెలిసిందే. విదేశాల‌పై అమెరికా ప్ర‌భుత్వం విధిస్తున్న టారిఫ్‌లు చెల్ల‌వ‌ని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన‌ప్ప‌టికి.. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. 

సుప్రీం కోర్టు తీర్పు అనంత‌రం ట్రంప్ విలేక‌రుల స‌మావేశంలో పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై దీని ప్రభావం ఉంటుందా? అని విలేకరులు ప్రశ్నించారు. "ఎలాంటి మార్పులు ఉండ‌వు. భార‌త్ టారిఫ్‌లు చెల్లిస్తారు. మేము మాత్రం చెల్లించ‌బోం. గతంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. 

అమెరికా కంటే భార‌త్‌కే ఎక్కువ లాభం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిని రివర్స్ చేశాం. మోదీ గొప్ప జెంటిల్‌మ్యాన్‌. చాలా తెలివైన వ్య‌క్తి. భార‌త్‌తో మా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో భారత్-అమెరికా మధ్య కుదిరిన ఓ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్ర‌కారం భారత ఎగుమతులపై సుంకాన్ని 50% నుండి 18%కి తగ్గించారు. ఇప్పుడు ఈ 18% టారిఫ్ కొనసాగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement