ప్రేమ.. ఒక జీవితం | Happy valentines day 2026 | Sakshi
Sakshi News home page

ప్రేమ.. ఒక జీవితం

Feb 14 2026 11:51 AM | Updated on Feb 14 2026 11:51 AM

Happy valentines day 2026

నిర్మల్‌: ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల పండుగగా భావిస్తుంటారు. కానీ, ప్రేమ అనేది ఈ ఒక్కరోజుకే పరిమితం కావొద్దు. జీవితాంతం కొనసాగాలని చాలామంది సీనియర్‌ ప్రేమికులు చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం అర్థవంతంగా సాగుతుందని, లేదంటే అర్ధంతరంగా ముగుస్తుందని సూచిస్తున్నారు. పరస్పర గౌరవం, నమ్మకం, సహనం ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ నిలుస్తుందని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సమయంలో తోడుగా నిలవడమే అవసరమని చాలామంది చాటుతున్నారు. అలాంటి ప్రేమజంటలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

జూనియర్‌–సీనియర్‌
జిల్లాకేంద్రానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు గేయన్మయి నాగరంజని, కావేటి శ్రీకాంత్‌లది ప్రేమవివాహం. వీరిద్దరూ వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో పీడియాట్రిక్‌ విభాగంలో పీజీ చదువుతుండగా కలిశారు. శ్రీకాంత్‌ సీనియర్‌ కాగా, నాగరంజని ఆయనకు జూనియర్‌. అప్పట్లో వీరిద్దరికీ ఒకే వార్డులో పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడే ఒకరి వివరాలు ఒకరికి తెలిశాయి. వారి విభాగం వారంతా ఒకసారి కోల్‌కతా కాన్ఫరెన్స్‌కి వెళ్లారు. అక్కడే ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం బయటపడింది. చదువులు కూడా పూర్తికాగానే ఇద్దరూ ధైర్యం చేసి ఇంట్లోవాళ్లకి చెప్పారు. మొదట్లో నాగరంజని వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. చాలారోజులు వేచిచూసి పెద్దలను ఒప్పించేదాకా ఓపికతో ఉండి చివరకు విజయం సాధించారు. అలా 2014 డిసెంబర్‌ 7న మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా ఒక పాప, బాబు ఉన్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలని, ప్రేమను పొందాలంటే ఓర్పు ఉండాలని వీరు సూచిస్తున్నారు.

ఇంట్లో ఒప్పించి ఒక్కటయ్యారు
జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యజంట అనిత, రా మకృష్ణలదీ ప్రేమవివాహమే. వీరిద్ద రు 1995లో ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పట్లో ప్రేమ అంటేనే ఓ భయం. ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే ఇంకా భయం. కానీ, వీరిద్దరూ అప్పట్లోనే ఇంట్లో పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య ప్రేమకు చిహ్నాలుగా పాప పద్మిని, బాబు ప్రద్యుమ్న ఉన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటేనే ప్రేమ కలకాలం నిలుస్తుందని, అలాంటి ప్రేమకూ అందరి మద్దతు ఉంటుందని వీరు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement