హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్‌మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. తాజాగా ఇప్పుడు వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్. ఇదెంత వరకు వాస్తవం అన్నది తెలియదు కానీ రష్మిక, హీరో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆమె స్నేహితులతో కలిసి రోమ్ టూర్‌లో ఉంది. ఆ యూరోపియన్ విహారయాత్రలో తన అభిమానులను ఫ్యాషన్ లుక్స్‌తో అలరిస్తోంది.
లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్‌లో ఫ్యాషన్ ఐకానిక్‌గా..
గోధుమ రంగు లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్‌లో వింటర్ ఫ్యాషన్ ఐకాన్‌గా మెరిసింది రష్మిక. ఆ కోట్ సరికొత్త ఫ్యాషన్ వైబ్స్‌ని సృష్టించింది.
నిట్టెడ్ టాప్‌లో రష్మిక మందన్న
రష్మిక మందన్న ధకించిన బూడిద రంగు అల్లిన టాప్‌లో సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా చేతిలో పువ్వుల గుత్తితో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టు డార్క్ ఫ్రేమ్డ్ గ్లాసెస్, మెటల్ బ్యాండ్‌తో స్టైలిష్ రిస్ట్ వాచ్‌తో లుక్‌ను అలంకరించింది.
బ్రౌన్ స్వెటర్‌లో వ్యాపారవేత్తలా..
అల్లిన గోధుమ రంగు స్వెటర్, చంకీ బ్లాక్ గ్లాసెస్‌లో అదరహో అనిపించేలా ఉంది ఆమె ఆహార్యం.
రష్మిక మందన్న రోమ్ వార్డ్‌రోబ్‌తో ఫ్యాషన్ ప్రియులను అలరించింది. నటి క్రీమ్ స్వెటర్, డెనిమ్ జీన్స్‌పై పొరలుగా ఉన్న మరొక నల్ల ట్రెంచ్ కోటును స్టైలిష్ ఐకాన్‌గా కనిపించింది. ఎక్కడ మేకప్ లేకుండా..చాలా సింపుల్‌గా సాదాసీదాగా నేచురల్ లుక్‌లో కనిపించి నేచరల్ స్టార్ అంటే సహజసిద్ధమైన అందం అని ఎలుగెత్తి చాటింది.
(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..)


