లైఫ్ సినిమాకు నిర్మాతగా విరిగినేని అంజయ్య
కుంభమేళా ఫేం పూసల మోనాలిసాతో సినిమా
నల్గొండ జిల్లా: నిడమనూరు చెందిన విరిగినేని అంజయ్య సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సహకారం సంఘం జిల్లా డైరెక్టర్ ఉన్న అంజయ్య సినీ రంగంలోకి నిర్మాతగా (పొడ్యూసర్) అడుగుపెట్టారు. మొదటి సినిమానే కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఫేం అయినా మోనాలిసాతో ‘లైఫ్’ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభ పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీనియర్ నటుడు సురేష్ హాజరయ్యారు. గతంలో సినీ రంగంలో డైరెక్టర్‌గా, సినీ ఫొటోగ్రాఫర్‌గా పలువురు నిడమనూరు మండల వాసులు పనిచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ చోటా కే.నాయకుడు నిడమనూరు మండలానికి చెందిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు మేరెడ్డి వెంకట్రాహుల్, నల్లమోతు సిద్ధార్థ తదితరులు హాజరయ్యారు.



