న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?
జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్‌ఎన్ నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన
తాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు.
ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్‌లైన్‌లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్‌లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
చదవండి: పనస కాయ చిప్స్‌తో ఏడాదికి రూ. 12 లక్షలు
తాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్‌లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్‌తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది.
దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్‌కు వెళ్లినా ఆమె డల్లాస్‌లో పెరిగారు. దుబాయ్‌లో చదివారు. ఆమె అనేక జర్నల్స్‌ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్‌లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్‌లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు.
గత డిసెంబర్‌లో దుబాయ్‌లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్‌హట్టన్‌లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్‌తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం.


