breaking news
Zohran Mamdani
-
ఇది భారతీయ–అమెరికన్ల విజయం
‘భారతీయులు వెళ్లిపోవాలి’... ఇదే ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మూకలు ఏడాదిగా చేస్తున్న నినాదం. భారతి సంతతి అమెరికన్లు వారి నినాదం విన్నారు, వెళ్లిపోయారు; కానీ ఇండియాకు కాదు. తాము ఎప్పటినుంచో మద్దతిస్తూ వచ్చి మధ్యలో వదిలేసిన డెమాక్రటిక్ పార్టీలోకి తిరిగి వెళ్లారు! న్యూయార్క్ నగర పునాదులను వారు కదిలించారు.సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ తాజా మేయర్ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించారు. మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో చిత్తుగా ఓడిపోయారు. మమ్దానీ న్యూయార్క్ మొట్టమొదటి ముస్లిం మేయర్. భారత మూలాలున్న తొలి మేయర్. ఈ వందేళ్లలో ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా! మారిన రాజకీయ మొగ్గు‘అమెరికన్ డ్రీమ్’ను సాకారం చేసుకునేందుకు వచ్చిన భారతీయులు– విద్యావంతులు, కుటుంబ జీవులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఒక ఆదర్శప్రాయమైన సమాజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంప్రదాయికంగా మేము డెమాక్రటిక్ పార్టీ సానుభూతిపరులం. ఇటీవలి కాలంలో మాలో చాలామంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గడం మొదలైంది. క్రమశిక్షణ, వ్యాపార వ్యవస్థాపక సామర్థ్యం, కుటుంబ విలువల పరంగా అది మా జీవి తానుభవానికి దగ్గరగా ఉండటం, మరోవంక డెమాక్రాట్లు రాను రానూ సాంస్కృతిక పోరాటాల్లో మునిగిపోవటం ఇందుకు కారణాలు. నేను కూడా ఈ ఆకర్షణలో పడ్డాను. 1980లో అమెరికా వచ్చి నప్పటి నుంచీ నేను డెమాక్రాట్స్కే ఓటు వేశాను. గత అధ్యక్ష ఎన్ని కలకు మాత్రం దూరంగా ఉన్నాను. జో బైడెన్‌కు వయసు మీరడం, స్పష్టమైన దిశ కొరవడటం వల్ల ఆయన అభ్యర్థిత్వం నాకు నచ్చ లేదు. మరోవంక, రిపబ్లికన్ పార్టీ చెబుతున్నదీ కొంతవరకు సబబు గానే అనిపించింది. కుటుంబం, మతవిశ్వాసం అంశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాలు, సోషలిజం గురించి ఆయన చేసిన హెచ్చరికలు నన్ను ఆకట్టు కున్నాయి. మాలో ఇండియాలో పుట్టిపెరిగిన వారున్నారు. వారికి ‘సామ్యవాదం’ అనేది శుద్ధమైన సిద్ధాంతంగా అనిపించదు. రేషన్ క్యూలైన్లు, సరుకుల కొరతలు, ప్రజలు ఏది తినాలో ఎంత సంపా దించాలో నిర్ణయించే అవినీతిపరులైన అధికార గణం... ఇవన్నీ సామ్యవాదపు వాస్తవికతకు అద్దం పడతాయి. చెదిరిన ఆశలునాలాంటి వలసదారులకు, కింది స్థాయి నుంచి ఉన్నత స్థానా లకు ఎదిగిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్ వంటి వారికి రిపబ్లికన్ పార్టీ ద్వారాలు తెరుస్తుందని నేను అనుకున్నాను. కానీ గడచిన ఏడాది కాలంలో మా ఆశలు హరించుకుపోయాయి. ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారిమీదే ‘మాగా’ ఉద్యమం నిప్పులు చెరుగుతోంది. లారా లూమర్ వంటి ఇన్‌ఫ్లుయె న్సర్లు ఇండియన్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి కాంగ్రెస్ సభ్యులు హెచ్–1బి వీసాలకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. భారతీయులు ‘అమెరికన్ల ఉద్యోగాలు దొంగిలిస్తున్నారు’ అని దుష్ప్రచారం చేశారు. సంకే తాలు స్పష్టంగా వెలువడుతున్నాయి: మేం అమెరికాకు ఎంత చేసినా, ఎప్పటికీ పూర్తి అమెరికన్లం కాబోము!అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్లు రెండు శాతంకంటే తక్కువే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6 శాతం. మా సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. ‘ఫార్చ్యూన్ 500’ జాబితాలోని 16 కంపెనీలకు భారత సంతతి సీఈవోలే సారథ్యం వహిస్తున్నారు. వారి నాయకత్వంలోని ఈ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు పట్టుగొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపా రుల నుంచి యూనివర్సిటీలు, ఆసుపత్రులను నిర్వహించే సైంటి స్టులు, ఇంజినీర్లు, వైద్యుల వరకు పలు రంగాల్లో విస్తరించి ఉన్న భారత సంతతి ప్రజలు మరే ఇతర దేశాల వలసదారుల కంటే మిన్నగా అమెరికాను బలోపేతం చేస్తున్నారు. అమెరికా అభ్యున్నతికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న మమ్మల్ని ‘గో హోమ్’ అనడం ద్రోహమే!భారత సంతతి అమెరికన్లకు గుండెకాయ లాంటి న్యూజెర్సీ లోని ఎడిసన్ ఓటర్లు ఈ అవమానానికి తగిన జవాబు చెప్పారు. 2024లో అక్కడి ఒక ప్రదేశం ట్రంప్‌కు 30 పాయింట్ల ఆధిక్యంఇచ్చింది. ఈ నెలలో, డెమాక్రాట్ మికీ షెర్రిల్ దాన్ని 76 పాయింట్ల తేడాతో గెలుచుకున్నాడు. 106 పాయింట్ల ఈ స్వింగ్‌కు విధానాలతో సంబంధం లేదు; ఆత్మగౌరవం తెచ్చిన మార్పు ఇది.డెమాక్రాట్లా? రిపబ్లికన్లా? ఏమైనా, పార్టీ విధేయతకు సంబంధం లేని కారణాలతోనే భార తీయ అమెరికన్లు డెమాక్రాట్ల చెంతకు తిరిగి వస్తున్నారు. ఆత్మ గౌరవం, అస్తిత్వ రక్షణ అవసరమే ఈ మార్పు తెచ్చింది. అంతేగానీ ప్రగతిశీల రాజకీయాల పట్ల మూఢభక్తి ఇందుకు కారణం కాదు.డెమాక్రటిక్ పార్టీ అన్ని వర్గాలనూ కలుపుకొనిపోవడం గురించి మాట్లాడుతుంది. అయితే, ఒకప్పడు తనకు కంచుకోటలా ఉన్న మధ్యతరగతితో ఇప్పుడు సంబంధం కోల్పోయింది. వలసదారులు పాటించే కుటుంబ విలువల నుంచి అది దూరం జరిగింది. శ్రామిక కుటుంబాల రోజువారీ బతుకు పోరాటాలను విస్మరించింది. అతి వాదుల చేతిలో ఆ పార్టీ బందీగా మారింది. సంస్కృతుల పోరా టాల్లో అది మునిగితేలుతోంది. ‘బాలికలు దుస్తులు మార్చుకునే గదుల్లో (లాకర్ రూమ్స్‌లో) బాలురు ఉండటం’ అనే అంశం మీద స్కూళ్లు చర్చలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. ఒకపక్క మౌలిక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి చర్చలు జరగడం పట్ల ‘నా’ లాంటి వలసదారులు సహా పలువురు అమెరి కన్ తల్లితండ్రులు దిగ్భ్రాంతి చెందారు.మమ్దానీ గెలుపు ఈ నూతన వాస్తవికత రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తోంది. ఒక సమాజపు ఆత్మవిశ్వాసం, స్వరం ఆయన ఎన్నిక వెనుక ఉన్నాయి. అదే సమయంలో, వాస్తవిక దృక్పథం లోపించిన సిద్ధాంతంతో ముడిపడిన ప్రమాదాలనూ అది వెల్లడిస్తోంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు నిర్వహిస్తామన్న ఆయన వాగ్దానం దయాపూరితంగా కనబడుతుంది. కానీ, పాత కాలపు ఇండియన్ సోషలిస్టు మోడల్ గురించి తెలిసిన నా లాంటి వారికి ఈ కథ ముగింపు ఎలా ఉండబోతోందో బాగా తెలుసు. అధికార గణస్వామ్యం, జనాకర్షక విధానం స్వల్పకాలంలో ప్రశంసలు కురిపించవచ్చు. అయితే అవి ప్రగతికి శత్రువులు. నాణ్యతకు బదులు నాసిరకంలో సమానత్వం వస్తుంది.రిపబ్లికన్లకు ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే వారు తమ దౌర్జన్య వైఖరిని విడనాడాలి. ఒకప్పుడు తమకు వన్నె తెచ్చిన తెగువ, యోగ్యత, ఆశావాదం వంటి విలువలను తిరిగి ఒంటబట్టించుకోవాలి. అందాకా, వారికి దూరమైన ఓటర్లు దూరంగానే ఉంటారు.వివేక్ వాధ్వావ్యాసకర్త విశ్లేషకుడు – ‘వయోనిక్స్ బయోసైన్సెస్’ సీఈఓ(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అమ్మ సినిమాలు వాస్తవం తెలిపాయి
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక అమ్మ ఉంటుంది. న్యూయార్క్ మేయర్‌గా గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్ మమ్దానీ తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు. ‘మా అమ్మ మీరా నాయర్ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి’ అన్నారాయన. మీరా నాయర్ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు.‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అంటుంటారు. ఇప్పుడు కాస్త మార్చి ‘న్యూయార్క్‌కు మేయర్ అయినా..అమ్మకు కొడుకే’ అనాలేమో. అవును! 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహా నగరానికి మేయర్‌గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ (34) తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్‌ను కూడా వార్తలలోకి ఎక్కించారు. మేయర్‌గా గెలిచినందుకు మమ్దానీ ఎంత గర్వపడుతున్నారో అతణ్ణి చూసి మీరా నాయర్ కూడా అంతే గర్వపడుతున్నారు. మమ్దానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా. సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్‌కు నామినేట్ అయిన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు. ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మమ్దానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్‌గా అనిపించవచ్చు. కాని అతని గెలుపు సినిమాటిక్ కాదు. మమ్దాని ఇచ్చిన నినాదం ‘న్యూయార్క్ వలసవాదుల నగరంగానే ఉంటుంది’ అనేది యాదృచ్చికంగా రాలేదు. తల్లి మీరా నాయర్ సినిమాల ప్రభావంతో అంది పుచ్చుకున్నది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’, ‘మిసిసిపి మసాలా’ పరాయి దేశాల్లో, పరాయి నగరాల్లో తమ స్థాయి, స్థానం కోసం పెనుగులాడే వలసజీవుల కథలు. ‘మీరు మావాళ్లు కాదు వెళ్లిపోండి’ అంటే మానవ పరిణామక్రమం, వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే. అందుకే మమ్దాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు. అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా, అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మమ్దాని హామీ ఇవ్వడం మీరా నాయర్ ప్రభావమే. యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్లలో పని చేసేవారు మమ్దాని. స్వతహాగా అతను రాప్ సింగర్ కూడా.వాస్తవ ప్రపంచం‘అమ్మ సినిమాలు చూడటం అంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే’ అంటారు మమ్దాని. వాస్తవికవాద సినిమాలనే మీరానాయర్ తీశారు. ఆమె తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే, ‘నేమ్‌సేక్’ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది. మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది. అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు, ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు, అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మమ్దాని ఏ న్యూయార్క్ నగరానికైతే మేయర్ అయ్యారో అదే నగరంపై జరిగిన 9/11 దాడి నేపథ్యంలో మీరానాయర్ ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ సినిమా తీశారు. తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం, వ్యక్తిత్వం, సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశా నిర్దేశం చేసిందంటారు మమ్దాని. తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా యూనివర్సిటీలో ్ర΄÷ఫెసర్ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జొహ్రాన్ మమ్దానీకి లాభించింది.మమ్దాని సలహా– మీరా ‘ది నేమ్‌సేక్’తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్ అంటారు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. ‘ది నేమ్‌సేక్’ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో ‘హ్యారీ పోటర్–4’కు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్, ప్రపంచ ప్రఖ్యాత నవల, బోలెడంత డబ్బు, పేరు. కానీ అప్పటికే ‘ది నేమ్‌సేక్’ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మమ్దానీకి 14 ఏళ్లు. ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా, ’అమ్మా! హ్యారీ పోటర్ తీయడానికి చాలామంది దర్శకులున్నారు. కానీ ‘ది నేమ్‌సేక్’ సినిమా నువ్వే తీయగలవు’ అని చె΄్పాడు. అది చాలా స్వేచ్ఛాయుతమైన, స్పష్టమైన ప్రకటన అని, అందుకే తాను ‘హ్యారీపోటర్’ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు. ‘నేను ముగింపును నమ్మను, ప్రారంభాలను నమ్ముతాను.‘ అంటారు మీరా నాయర్. ఆ లెక్కన మమ్దానీకి ఇది ప్రారంభం. మేయర్‌గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి. ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది. -
మమ్దాని ఎవరైతే నాకేంటి?
న్యూయార్క్: అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్‌గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దా నిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన చేశారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. మియామీలో అమెరికా బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ ప్రసంగించారు. గత ఏడాది నవంబర్ 5న అమెరికా ప్రజలు తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకు న్నారని, తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ధ రించారని చెప్పారు. కానీ, మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో సార్వభౌమత్వాన్ని కొంత కోల్పో యినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇకపై ఏదైనా జరిగితే తాను చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. న్యూయార్క్‌లో జరిగింది నిజానికి భయానక ఘటన అని అభివర్ణించారు. అలా జరగకూడదని తాను కోరుకున్నానని.. కానీ, జరిగిపోయిందని చెప్పారు. ‘‘న్యూయార్క్‌లో ఉన్న వ్యక్తి పేరు (మమ్దాని) ఏదైనా కావొచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతడు ఎవరైతే నాకేంటి? మహిళల క్రీడల్లో పురుషులు ఆడడం ఎలా ఉంటుందో ఆలోచించండి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమొక్రటిక్ పార్టీ న్యూయార్క్‌లో ఒక కమ్యూనిస్ట్‌ని మేయర్‌గా ప్రతిష్టించిందని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో కమ్యూనిజం ఏనాడూ పనిచేయలేదని గుర్తుచేశారు. సోషలిస్ట్‌ను కాదను కొని అదేస్థానంలో కమ్యూనిస్ట్‌ను తలకెత్తు కోవడం ఏమిటని ప్రశ్నించారు. అమెరికాను కమ్యూనిస్ట్ క్యూబాగా, సోషలిస్ట్ వెనుజులా మార్చడానికి తమ ప్రత్యర్థులు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. క్యూబా, వెనుజులాలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని చెప్పారు. డెమొక్రాట్లు అతివాదులుగా మారుతున్నారని ఆరోపించారు. కమ్యూనిజం పాలనలో ఉన్న న్యూయార్క్ నుంచి వచ్చేవారితో మియామీ శరణార్థి శిబిరంగా మారిపోతుందేమోనని డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తంచేశారు. కమ్యూనిస్ట్‌లు, మార్క్సిస్ట్లు, సోష లిస్ట్‌లు, గ్లోబలిస్ట్లతో విధ్వంసమే తప్ప ఒరిగిదేమీ ఉండదని తేల్చిచెప్పారు. తాను అధికా రంలో ఉన్నంత కాలం అమెరికా ఎట్టిపరిస్థితుల్లో కమ్యూ నిస్ట్ దేశంగా మారబోదని ట్రంప్ పేర్కొన్నారు. -
బంగారం, వెండి, బిట్‌కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. సందర్భమేదైనా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, బిటికాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీపై తన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) ఎన్నికైన సందర్భంగా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజగా ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.‘మార్క్సిస్ట్ మామ్దానీ న్యూయార్క్ మేయర్ అయ్యారా? అతను రెంట్ స్టెబిలిటీని పెంచుతారని న్యూయార్క్ వాసులకు తెలుసా?’ అంటూ ట్వీట్ చేశారు. అద్దెపై నియంత్రణ అన్నది మార్క్సిస్ట్ సిద్ధాంతమని, దానర్థం అపార్ట్మెంట్ తరాలుగా అద్దెకుండేవారి చేతుల్లోనే ఉండిపోతుందని, ఓనర్లు మాత్రం హక్కులు కోల్పోతారని హెచ్చరించారు.అన్నింటికీ మార్క్సిస్ట్ ప్రభుత్వమే యాజమాని అయ్యేటప్పుడు ఇక ప్రజలు దేనికైనా ఓనర్లుగా ఉండటం ఎందుకు? అంటున్నారు. అమెరికా స్వేచ్ఛ, పెట్టుబడి వ్యవస్థ కోల్పోంతోందని, మార్క్సిస్ట్ దేశంగా మారిపోతోందని అసంతృప్తిని వెలిబుచ్చారు. వామపక్ష ప్రభుత్వం నడిపే స్కూళ్లలో ఆర్థిక బోధన ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, అసలైన ఆర్థిక జ్ఞానంతో మిమ్మిల్ని మీరు రక్షించుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు. రియల్ మనీ గురించి తెలుసుకోవాలన్నారు. బంగారం, వెండిని (gold and silver) దేవుని సొమ్ముగా, బిట్‌కాయిన్, ఎథీరియంను ప్రజా సొమ్ముగా అభివర్ణించారు.OMG: Marxist Momdami Mayor of NYC? Don’t New Yorkers know that he will increase “Rent Stability” which is Marxist and means;1: Infinite Rent Control…. Which means a renter has control of their apartment for generations. A person can pass on their apartment to their kids,…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 5, 2025 -
‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో మేయర్‌గా తాను భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యకలాపాలను ఒక వీడియో ద్వారా వివరించారు. తాను ఇప్పటివరకూ ప్రచారంపై పెట్టిన దృష్టిని ఇకపై పాలనవైపు మళ్లిస్తానని పేర్కొన్నారు.సమర్థవంతమైన పాలనను అందించేందుకు, అందుకు అనుగుణమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నానని, శ్రేష్ఠత, సమగ్రత, నూతన మార్గాలతో సమస్యలను పరిష్కారం దశగా అడుగులు వేయనున్నానని తెలిపారు. న్యూయార్క్ అసెంబ్లీలో క్వీన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్దానీ అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా గుర్తింపు పొందారు. తన విజయం దరిమిలా మమ్దానీ ‘ఎక్స్’ ఖాతాలో ‘2025, జనవరి ఒకటిన నేను మేయర్‌గా మీ ముందు ఉంటాను. నూతన సంవత్పర వేళ ఈ నగరానికి కొత్త యుగం రాబోతోంది. మంచి ట్రాక్ రికార్డులు కలిగిన ప్రభుత్వశాఖల అనుభవజ్ఞులు, విధాన నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామికులు నగరాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటారంటూ’ తన ప్రభుత్వ పాలనా తీరును మమ్దానీ వివరించారు. Thank you, New York City. Together we made history.Now let’s get to work. https://t.co/G7F2sbda74 pic.twitter.com/GQABMqJHgn— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 5, 2025తన పాలనతో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని మమ్దానీ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా మమ్దానీ విజయం దేశంలోని డెమొక్రాట్లకు ఆనందాన్ని అందించింది. మరోవైపు పార్టీలో ధైర్యాన్ని పెంచింది, 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌కు హెచ్చరికగా మారింది. తన ప్రచారంలో మమ్దానీ శ్రామిక వర్గానికి పలు హామీలిచ్చారు. చిన్నారులకు ఉచిత వైద్యం, ఉచిత బస్సు రవాణా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల ఏర్పాటు తదితర హామీలను ఆయన ప్రజలకు ఇచ్చారు. మమ్దానీ తన సోషలిస్ట్ ఆదర్శాలు, ముస్లిం గుర్తింపు కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మమ్దానీ.. న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించి వాటిని తిప్పికొట్టారు. ఇది కూడా చదవండి: పాక్ మద్దతు.. భారత్‌లో మరో ఉగ్రదాడి? -
న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు
-
వలసదారుడే ప్రథమ పౌరుడు
న్యూయార్క్: జొహ్రాన్ క్వామె మమ్దాని 1991 అక్టోబర్ 18న ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. గుజరాతీ ముస్లిం ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని, బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ ఆయన తల్లిదండ్రులు. జొహ్రాన్ మమ్దానికి ఐదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు వలస వెళ్లింది. ఆయన కేప్‌టౌన్‌లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకున్నారు. మమ్దాని కుటుంబం న్యూయార్క్‌లో స్థిరపడింది. బాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2014లో బౌడిన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ స్వీకరించారు. అనంతరం హౌజింగ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. న్యూయార్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డెమొ క్రటిక్ పార్టీ ప్రచారకర్తగా సేవలందించారు. 2020లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2022, 2024లోనూ గెలిచారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 2024 అక్టోబర్‌లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కుమోపై పైచేయి సాధించారు. మమ్దాని 2025 ఫిబ్రవరిలో సిరియన్ ముస్లిం రమా సవాఫ్ దువాజీని వివాహం చేసుకున్నారు. ఆమె యానిమేటర్‌గా, ఇల్రస్టేటర్గా పని చేస్తున్నారు. -
న్యూయార్క్ మేయర్‌గా మమ్దాని
న్యూయార్క్: భారతీయ–అమెరికన్, డెమొక్రటిక్ పార్టీ నేత జొహ్రాన్ మమ్దాని(34) చరిత్ర సృష్టించారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్ నగర మేయర్‌గా ఘన విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మతస్థుడిగా, దక్షిణాసియా మూలాలున్న తొలి వ్యక్తిగా, అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కారు. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు, పంజాబీ హిందూ మీరా నాయర్ కుమారుడైన మమ్దాని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మాజీ గవర్నర్, స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ కుమో, రిపబ్లికన్ నామినీ కురి్టస్ స్లివాను సునాయాసంగా ఓడించారు. 50 శాతానికి పైగా ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. ట్రంప్ అండతో బరిలోకి దిగిన ఆండ్రూ కుమో ఓటమి పాలయ్యారు. ఆయనకు 41 శాతం ఓట్లే లభించాయి. కురి్టస్ స్లివాకు కేవలం ఏడు శాతం ఓట్లు రావడం గమనార్హం. మమ్దాని అధ్యక్షుడిగా ఎన్నికైతే న్యూయార్క్‌కు కనీస అవసరాలకు సరిపడినంత మాత్రమే నిధులు కేటాయిస్తానని ట్రంప్ ప్రకటించారు. పైగా మమ్దాని కమ్యూనిస్టు అని, ఆయనకు ఓటు వేయొద్దని ప్రజలకు స్వయంగా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ జనం మమ్దానికి పట్టం కట్టారు. దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మమ్దానికి 10,36,051(50.4 శాతం), కుమోకు 8,54,995 (41.6 శాతం), స్లివాకు 1,46,137 (7 శాతం) ఓట్లు లభించాయి. 111వ ప్రథమ పౌరుడు జొహ్రాన్ మమ్దాని వచ్చే ఏడాది జనవరిలో న్యూయార్క్ 111వ ప్రథమ పౌరుడిగా బాధ్య తలు చేపట్టబోతున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముస్లిం యువకుడు నెగ్గడం అమెరికన్ల ఆలోచనాధోరణిలో వస్తున్న మార్పునకు ప్రతీక అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ప్రజాగ్రహానికి ఉదాహరణ అని అంచనా వేస్తున్నారు. ప్రగతిశీల రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు. మరోవైపు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లోనూ డెమొక్రటిక్ అభ్యర్థులే విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ అభ్యర్థులకు పరాభవం ఎదురైంది. -
ట్రంప్.. సౌండ్ పెంచుకోండి
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై నిప్పులు చెరిగారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చిచెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టంచేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంశకుత్వంపై విజయంగా, ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని మమ్దాని ప్రస్తావించారు. చీకటి నుంచి వెలుగులోకి, పాత యుగం నుంచి కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం అర్ధరాత్రి బ్రూక్లిన్ పారామౌంట్‌లో మమ్దాని వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. భవిష్యత్తు మన చేతుల్లోని ఉందని అన్నారు. రాజకీయ వారసత్వాన్ని, రాజవంశాన్ని కూల్చేశామని చెప్పారు. మార్పు కోసం, కొత్త తరం రాజకీయాల కోసం న్యూయార్క్ సిటీ గొప్ప తీర్పు ఇచ్చిందని ప్రశంసించారు. నూయార్క్ను మన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తీర్పు వచ్చిందన్నారు. ప్రజలకు నిజాయతీగా సేవ చేసే ప్రభుత్వం కోసం తీర్పు లభించిందన్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య మమ్దాని ఇంకా ఏం మాట్లాడారంటే... అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం ‘‘ఈరోజు మీ ముందుకు రావడం గర్వంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ మాటలు గుర్తుచేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక శకం ముగిసినప్పుడు.. పాత శకం నుంచి కొత్త శకం వైపు అడుగులు వేసినప్పుడు.. సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ తన గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈరోజు పాత శకం నుంచి నూతన శకంలోకి ప్రవేశించాం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎవరూ అపార్థం చేసుకోకుండా స్పష్టంగా, సంకల్పంతో మాట్లాడుకుందాం. వలసదారులతోనే న్యూయార్క్ మరింత శక్తివంతంగా మారుతుంది. ఇకపై వలసదారుడే నగరానికి సారథ్యం వహించబోతున్నాడు. ఒక గొప్ప మార్పునకు మనం కలిసికట్టుగా నాంది పలుకుదాం. అణచివేతను ఎదుర్కొందాం. అంతులేని అధికారం అండతో వలసదారులపై పగబట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు బుద్ధి చెబుదాం. డొనాల్డ్ ట్రంప్.. మీరు నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నాలుగు మాటలున్నాయి. అందుకే సౌండ్ పెంచుకోండి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఎందరో ట్రంప్‌లు ప్రజలను అడ్డం పెట్టుకొని అక్రమంగా పైకి ఎదిగారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులు ఎగవేశారు. పన్ను చట్టాలను ఉల్లంఘించారు. ఇకపై అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం. కార్మిక, ప్రజా సంఘాలకు అండగా ఉంటాం. కార్మికుల రక్షణలు మరింత విస్తరింపజేస్తాం. కష్టపడి పనిచేసేవారికి తగిన హక్కులు ఉండాల్సిందే. ఏ జాతి వారైనా ప్రియమైనవారే.. రాజకీయ అంధకారం నుంచి న్యూయార్క్‌ను వెలుగులోకి నడిపిస్తాం. మేము ప్రేమించేవారందరికీ మేము తోడుగా ఉంటాం. వారు వలసదారులైనా, ట్రాన్స్‌జెండర్లయినా, ఏ జాతి వారైనా మాకు ప్రియమైనవారే. ఓ నల్లజాతి మహిళను ప్రభుత్వం ఉద్యోగం నుంచి డొనాల్డ్డ్ట్రంప్ అన్యాయంగా తొలగించారు. ఆ ఒంటరి మహిళ చాలా కష్టాలు పడుతూ బతుకు పోరాటం చేస్తోంది. అందుకే ప్రజల కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం. న్యూయార్క్‌లో అన్ని జాతులకూ సమానమైన ఆదరణ లభిస్తుంది. ఎవరిపైనా ఎలాంటి వివక్ష ఉండదు. నగరంలో ఇస్లామోఫోబియాకు స్థానం లేదు. ముస్లింలు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, విజయం సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యువకుడిని. వృద్ధుడిగా మారినా కూడా ముస్లింగానే ఉంటాను. నేనొక డెమొక్రటిక్ సోషలిస్ట్‌ను. ముస్లింను అయినందుకు క్షమాపణ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకు నిరాకరిస్తున్నా. నన్ను గెలిపించినందుకు న్యూయార్క్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధూమ్ మచాలే ధూమ్ ఇలాంటి రోజు ఒకటి ఎప్పటికీ రాదని చాలామంది భావించారు. రాజకీయాలు చాలా క్రూరంగా మారాయని అనుకున్నారు. ఆశను కోల్పోయారు. అలాంటి భయాలకు న్యూయార్క్ నేడు సమాధానం చెప్పింది. ఆశారేఖ సజీవంగానే ఉంది. అసాధ్యం సుసాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించడం వల్లే మనం గెలిచాం. వచ్చే ఏడాది జనవరి 1న మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తా. నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను తీర్చిదిద్దింది వారే. నా భార్య రమా దువాజీకి కూడా కృతజ్ఞతలు’’ అని మమ్దాని పేర్కొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, భార్య అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘ధూమ్’లోని ‘ధూమ్ మచాలే ధూమ్’ పాట మార్మోగిపోయింది. -
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్‌లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్‌తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్‌లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్‌కు వెళ్లినా ఆమె డల్లాస్‌లో పెరిగారు. దుబాయ్‌లో చదివారు. ఆమె అనేక జర్నల్స్‌ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్‌లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్‌లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్‌లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్‌హట్టన్‌లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్‌తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం. -
ట్రంప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన మమ్దనీ
-
మేయర్‌గా మమ్దానీ: తల్లి తొలి స్పందన
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్‌స్టా పోస్ట్‌ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు. కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్‌తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు. -
నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్‌గానూ పేరొందారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్‌లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ! -
ట్రంప్‌కు భారీ షాక్.. మమ్దానీ గెలుపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. కాగా, అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్‌లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం. BREAKING: Democratic Socialist Zohran Mamdani wins the New York City mayoral election, Decision Desk HQ projects pic.twitter.com/iphko44pmF— Republicans against Trump (@RpsAgainstTrump) November 5, 2025మమ్దానీ హామీ..జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది. సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్‌లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్వేలలో(అండర్‌గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్‌తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే.. మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: మూన్‌లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే! -
మమ్దానీని వెంటాడుతున్న పాత పోస్టులు.. ఏం జరగనుంది?
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న జొహ్రాన్ మమ్దానీ చిక్కుల్లో పడ్డారు. 2015లో మమ్దానీ ‘ఎక్స్’లో అల్ ఖైదా ఉగ్రవాదికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడిని వెంటాడుతున్నాయి. అమెరికాలో జన్మించిన అన్వర్ అల్–ఔలాకీ అనే మత బోధకుడు తీవ్రవాదం బాట పట్టడానికి ఎఫ్‌బీఐ నిఘా కారణం కావచ్చు అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి.అయితే, వందశాతం కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ మమ్దానీని ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాతర ఆయన పాత పోస్టులు తాజాగా వెలుగు చూశాయి. న్యూమెక్సికోలో యెమెన్ దేశస్తుల కుటుంబంలో జన్మించిన ఔలాకీ అమెరికాలోని మసీదుల్లో బోధనలు చేసేవాడు. అటు తర్వాత అల్‌ఖైదాలో అగ్ర నాయకుల్లో ఒకడయ్యాడు.అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ తదితరాలపై 2001 సెప్టెంబర్ 11న దాడులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇతడికి సన్నిహితులని తేలడంతో ఎఫ్‌బీఐ నిఘా పెంచింది. అటు తర్వాత అతడు 2004లో యెమెన్‌కు వెళ్లిపోయాడు. అమెరికా ఆస్తులపై దాడులు ఇతడు ఉగ్రవాదులకు పిలుపు ఇచ్చాడనే ఆరోపణలపై 2011లో అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు యెమెన్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. ఎలాంటి నేరారోపణలు లేని అమెరికా పౌరుడిని ప్రభుత్వమే చంపడం అసాధారణ విషయమని న్యూయార్క్ పోస్ట్ అప్పట్లో వ్యాఖ్యానించింది. -
ఇలాంటి వ్యక్తి సామాన్యుల కష్టాలను తొలగిస్తాడా?
న్యూయార్క్ నగరంలో ఆర్థిక అసమానతలను రూపుమాపుతానంటూ సోషలిస్ట్ తరహా వాగ్దానాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ మేయర్ అభ్యర్థి జొహ్రాన్ ఖ్వామీ మమ్దానీ(33)పై విమర్శల దాడి పెరిగింది. భారతీయ మూలాలున్న మమ్దానీ తల్లిదండ్రులు మీరా నాయర్, మహూమ్ద్ మమ్దానీల ఆస్తిపాస్తుల వివరాలనే అస్త్రాలుగా మార్చుకున్న విమర్శకులు.. ఆయనకు సోషలిజం (Socialism) గురించి మాట్లాడే అర్హత లేదని దెప్పి పొడుస్తున్నారు. మమ్దానీ కుటుంబ నేపథ్యానికి, ఆయనిస్తున్న వాగ్దానాలకు పొంతనే లేదంటున్నారు.జొహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani)కి ఉగాండాలో ఉన్న నాలుగెకరాల ప్లాట్ విలువే 2.50 లక్షల డాలర్ల ఖరీదుంటుందని, ఖరీదైన మన్‌హట్టన్ ప్రాంతంలో విలాస వంతమైన నివాస భవనముందని చెబుతున్నారు. మమ్దానీ కుటుంబానికి 10 లక్షల డాలర్ల దాకా విలువైన ఆస్తులున్నాయని ట్రంప్ తరఫున లారా లూమర్, మెఘన్ మెక్కెయిన్ తెలిపారు.ఉన్నత విద్య, పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన జొహ్రాన్ మమ్దానీకి సగటు ఉద్యోగికి ఉండే ఇబ్బందులేమీ లేవని, ఇటువంటి వ్యక్తి సామాన్యుల ఇబ్బందులను ఎలా తీరుస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలు మరో నాలుగు నెలలుండగా, మమ్దానీపై విమర్శలు ఇప్పటికే తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.చదవండి: నీ భార్య నిన్ను వదిలి వెళ్లిపోతుంది -
'చేత్తో తినడం' ఇది ఎప్పటి అలవాటంటే..!
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్‌లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్‌లు, స్పూన్లు,చాకులతోనే తినేవారా అంటే..చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్‌గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్‌ఫుల్‌గా తినేందుకు చిహ్నం.అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్‌లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్‌లు, ఫోర్క్‌లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం. చాప్‌స్టిక్స్ సంగతేంటి?చైనా, జపాన్‌లోని ప్రజలు చాప్‌స్టిక్‌లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్‌లు, చాక్‌లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్‌లో చాప్‌స్టిక్‌తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది. వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్‌గా తినాంటే ఆ చాప్స్టిక్లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.చేత్తో తినడం మంచిదేనా.. చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు. అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!) -
అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్‌ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్‌గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్‌ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు. -
అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్‌పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక పాలనలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విధి నిర్వహణకు అడ్డుతగిలితే డెమొక్రాట్ జోహ్రాన్ మమ్దానీని అరెస్టు చేస్తామని ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది.దీనిపై భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు తాను తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. మమ్దానీ అధికారికంగా న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రాబోయే నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొననున్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ధృవీకరణ జరిగిన వెంటనే ఆయన ట్రంప్ తీరుపై మండిపడ్డారు. ఒక ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను పట్టించుకోనని స్పష్టం చేశారు. My statement on Donald Trump's threat to deport me and his praise for Eric Adams, who the President "helped out" of legal accountability. https://t.co/m7pNcT2DFS pic.twitter.com/UcYakMx4lI— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 1, 2025యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు తనను అరెస్టు చేస్తానని, తన పౌరసత్వాన్ని తొలగించి, నిర్బంధ శిబిరంలో ఉంచుతానని హెచ్చరించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయన ఆరోపించారు. 2021లో డెమొక్రాట్‌గా ఎన్నికైన ఆడమ్స్‌ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదని, అది మేయర్ ఆడమ్స్ పదవీకాలానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుందని అన్నారు.దక్షిణాసియాలోని ఉగాండాలో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు. ఆయన నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే, ఈ నగరానికి తొలి ముస్లిం మేయర్ కానున్నారు. కాగా మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని పలువురు రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఇటీవలే అంటే.. 2018లోనే అమెరికా పౌరసత్వం పొందారని అంటున్నారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే.. -
పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ ఏం చేసినా ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాపీగా కూర్చుని పప్పన్నం తిన్నా సరే అమెరికా రాజకీయనేతలు తీవ్రంగా తప్పుబట్టడం ఇప్పుడు కొత్త వార్తాంశంగా నిలిచింది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమ్దానీ భోజనం చేస్తూ కనిపించారు. ఒక చిన్న ప్లేట్లో అన్నం, పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తిన్నారు. ‘‘ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న(థర్డ్ వరల్డ్) దేశాల నుంచే నేర్చుకున్నా’’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ‘ఎడ్ ఓక్నెస్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఒకతను పోస్ట్‌చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘ అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అని చెబుతున్నారు’’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనికిఅమెరికా దిగువసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ సైతం మద్దతు పలికి మమ్దానీని తప్పుబట్టారు. Civilized people in America don’t eat like this.If you refuse to adopt Western customs, go back to the Third World. https://t.co/TYQkcr0nFE— Congressman Brandon Gill (@RepBrandonGill) June 30, 2025‘‘ అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నారు. మీకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే ఆ థర్డ్ వరల్డ్‌లోనే బతకండి. అక్కడికి వెళ్లిపొండి’’ అని ఒక క్యాప్షన్ పెట్టారు. ‘‘ రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఆయన ఇలా చేత్తో తింటున్నారు. సాధారణంగా ఆయన చేత్తో కాకుండా చెంచాలు, ఫోర్క్‌లతో తింటారు’’ అని కొందరు నెటిజన్లు విమర్శించారు. మ్యాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ సైతం విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ఆయన చక్కగా చేత్తో కలుపుకుని తిన్నారు. తినడం అనేది ఆయా వ్యక్తుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లకు సంబంధించిన అంశం. ఇది పూర్తిగా జాత్యహంకారమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే సత్తాలేక ఆయన వ్యక్తిగత అలవాట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చేత్తో తినని వాళ్లకే అమెరికా చెందుతుందని రాజ్యాంగంలో రాశారా?. చేత్తో తింటే అనాగరికం ఎలా అవుతుంది?’’ అని మరికొందరు మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ టాకూస్, ఫ్రెంచ్ ప్రై, బర్గర్, పిజ్జా, లేస్ ప్యాకెట్ ఎలా తింటారు?. చేత్తోనేకదా తినేది. మరి అలాంటప్పుడు పప్పన్నం హాయిగా చేత్తో కలిపి తింటే తప్పేంటట?’’ అని మరికొందరు వాదించారు. ‘‘ అమెరికాలో అన్నం చేత్తో తినడం కూడా తప్పేనా?. అమెరికా ఎటు పోతోంది?’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. -
మమ్దానీ పౌరసత్వం రద్దు చేయాలి
వాషింగ్టన్: అమెరికాలో న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీపడుతున్న భారత సంతతి నాయకుడు జోహ్రాన్ మమ్దానీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఇప్పటికే డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఇండియన్–అమెరికన్ సినీ దర్శకురాలు మీనా నాయర్ కుమారుడైన మమ్దానీ పౌరసత్వంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని, ఆయనను దేశం నుంచి వెళ్లగొట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ, దాని అనుబంధ గ్రూప్‌లు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన అమెరికా పౌరుడు కాదని వాదిస్తున్నాయి. మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ముస్లిం మతస్థుడు కావడంతో కొన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని టెన్నెస్సీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ ఓగ్లెస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీకి లేఖ రాశారు. మమ్దానీ తప్పుడు ఆధారాలతో అమెరికా పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చారని, పైగా ఆ విషయం దాచిపెట్టారని ధ్వజమెత్తారు. రాడికల్ జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్‌ను నాశనం చేస్తానంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్థానిక యంగ్ రిపబ్లికన్ క్లబ్ తేల్చిచెప్పింది. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. ‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Arya Rajendran: మమ్దానీ మెచ్చిన మన మేయర్
జోహ్రాన్ మమ్దానీ.. ప్రపంచం మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన భారత సంతతి వ్యక్తి. న్యూయార్క్ నగర మేయర్ పదవి రేసులో అభ్యర్థిగా నిలబడిన ఈ 33 ఏళ్ల యువ నాయకుడి ప్రచార శైలి, ఎన్నికల హామీల గురించే అక్కడి జనం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ యువ నేత గురించి ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్య రాజేంద్రన్.. ఈ పేరు గుర్తుందా?. కేవలం 21 ఏళ్ల వయసులో తిరువనంతపురం మేయర్ పదవి చేపట్టారు. తద్వారా దేశంలోనే అత్యంత చిన్నవయసులో మేయర్‌గా ఎన్నికైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ టైంలో తన సోషల్ మీడియా ఖాతాలో మమ్దానీ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు హైలైట్ అవుతోంది. న్యూయార్క్‌కు ఎలాంటి మేయర్ అవసరం?.. రాజేంద్రన్ లాంటి నేత అవసరం అంటూ పోస్ట్ చేశారాయన. డెమొక్రటిక్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా మమ్దానీ ఎన్నికైన తరుణంలో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. them: so what kind of mayor does nyc need right now?me: https://t.co/XEuvK6VvOc— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) December 27, 2020👉1999 జనవరి 12వ తేదీన జన్మించిన ఆర్య రాజేంద్రన్.. తిరువంతపురం కార్పొరేషన్ మేయర్. నెమోం అసెంబ్లీ నియోజకవర్గం ముడవన్ముగల్ వార్డు నుంచి ఆమె ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – CPI(M)లో ఉన్నారు. కిందటి ఏడాది తిరువనంతపురం జిల్లా కమిటీకి కూడా ఎన్నికయ్యారు. ఈమె భర్త కేరళ అసెంబ్లీకి చిన్న వయసులో ఎన్నికైన శాసన సభ్యుడు కేఎం సచిన్ దేవ్. 2023లో ఆమె నెల వయసున్న చంటి బిడ్డతో కార్యాలయంలో పని చేసిన వీడియో బాగా వైరల్ కావడంతో.. ఆమెపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో.. కిందటి ఏడాది ఓ బస్సు డ్రైవర్‌తో ఆమెకు జరిగిన వాగ్వాదం తీవ్ర విమర్శలకు దారి తీసింది కూడా. ఇక.. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న భారతీయ మూలాల జోహ్రాన్ మమ్దానీ 2020లో ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైది. “న్యూయార్క్‌కు అవసరమైన మేయర్ ఎవరు?”అంటూ ఆమెను ఉదాహరణగా చూపించారు. ఆర్య మేయర్‌గా వేస్టేజ్ మెనేజ్మెంట్తోపాటు ఆరోగ్య సేవల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 24/7 ఆరోగ్య కేంద్రాలు, శాస్త్రీయ వ్యర్థాల పారవేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.👉33 ఏళ్ల వయసున్న జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ మేయర్ పదవి రేసులో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో ఈయన జన్మించాడు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో.. ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రాసరి స్టోర్లు లాంటి హామీలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలు కూడా ఉన్నాయి. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. అంతేకాదు.. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నేత అంటూ ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే జోహ్రాన్ మమ్దానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడాయన. నవంబర్‌లో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే.. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. -
విమర్శల జడివానలో మమ్దానీ
అన్ని వర్గాల నుంచి విమర్శల బాణాలు గుచ్చుకుంటున్నా గెలుపే లక్ష్యంగా సాగిపోతున్న మమ్దానీ వైఖరిపై ఇప్పుడు న్యూయార్క్ నగరవ్యాప్తంగా చర్చకొనసాగుతోంది. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరితో వార్తల్లోనేకాదు న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లోనూ నిలిచి డెమొక్రటిక్ అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీని భారత్‌లోనూ పెద్దసంఖ్యలో ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హిందూయిజం, భారత ప్రభుత్వ పాలనా విధానాలపైనా మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తరచూ అబద్దాలు వల్లెవేస్తూ అందలానికి ఎక్కాలని చూసే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలూ పెరిగాయి. మొదట్నుంచీ అతి వాగ్దానాలు డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న వెంటనే మమ్దానీని ‘నెరవేరని వాగ్దానాలుచేసే నేత’గా ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు. ‘‘ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దానీ అచ్చు అలాగే మాట్లాడతారు. నెరవేర్చడం అసాధ్యం అని తెల్సికూడా ఇష్టమొచి్చన హామీలిస్తాడు’’అని ఎరిక్ ఆరోపించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మమ్దానీని ఓడిస్తానని ఎరిక్ ప్రతిజ్ఞచేశారు. ‘‘అపార్ట్మెంట్లలో అద్దెలను క్రమబద్దీకరిస్తానని, అవసరమైతే భారీగా తగ్గేలా చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చాడు. ప్రజాధనంతో ప్రజలందరికీ ఉచిత బస్సు, శిశుసంరక్షణ కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరకు దుకాణాలు తెరుస్తానన్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చేందుకు ఏకంగా 10 బిలియర్ డాలర్లు ఖర్చువుతుందని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన నగదు మొత్తాలను న్యూయార్క్ నగరంలోని సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి పన్నుల రూపంలో ముక్కు పిండిమరీ వసూలుచేస్తానన్నాడు. అయితే నగరంలో పన్నులు వసూలుచేసే అధికారం మేయర్‌కు ఉండదన్న కనీస అవగాహన మమ్దానీకి లేదు’’అని ఆడమ్స్ గుర్తుచేశారు. మమ్దానీ ప్రస్తుతం క్వీన్స్ 36వ జిల్లా నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పాలస్తీనాకు జై.. నెతన్యాహూకు నై పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దానీ ప్రసంగాలిస్తుంటారు. గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ సేనల భీకర దాడులను ఈయన తీవ్రంగా తప్పుబట్టారు. దాడులకు ఆదేశించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యుద్ధనేరాలకు పాల్పడిన నేరస్తుడిగా మమ్దానీ అభివరి్ణంచారు. ‘‘యుద్దనేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం నెతన్యాహూపై 2024 నవంబర్లోనే అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అతను న్యూయార్క్‌కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా’’అని మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఒంటికాలిపై లేచి ఆగ్రహం వ్యక్తంచేశాయి. మోదీపైనా విమర్శలు గుజరాత్ అల్లర్లలో ఎంతో మంది ముస్లింలు చనిపోయారని, అందుకు నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీయే కారణమని మమ్దానీ గత నెలలో ఆరోపించారు. అమెరికాలో ఏదైనా వేడుకలో మోదీతో కలిసి మీరు వేదికను పంచుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మమ్దానీ పైవిధంగా సమాధానమిచ్చారు. ‘‘నెతన్యాహూ మాదిరే మోదీ కూడా యుద్దనేరస్తుడే. గుజరాత్లో ఎంతో మంది ముస్లింల మరణాలకు మోదీ కూడా కారణమే. అందరూ చనిపోగా గుజరాత్లో మచ్చుకైనా మనం మిగిలిపోతామ ని ఒక్క ముస్లిం కూడా భావించి ఉండడు’’ అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలూ తీవ్ర అభ్యంతరంవ్యక్తంచేశారు. ‘‘మమ్దానీ ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్‌లోని తప్పుడు ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్‌పై విద్వేషం చిమ్ముతాడు. న్యూయార్క్ నుంచి ఊహాత్మక అబద్దాలు అల్లే ఇతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదు’’అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. నగరంలో మమ్దానీకి మద్దతుదారులు పెరిగితే చివరకు ‘జిహాదీ మేయర్’అవతరిస్తాడు అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మమ్దానీని విమర్శించే వాళ్లు అతని తల్లిదండ్రులపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘మమ్దానీ తండ్రి అసలైన మార్కిస్ట్కాదు. నిఖార్సయిన వ్యక్తికాదు. ఇక అతని తల్లి మీరా నాయర్ అసలైన కేరళ మలయాళీ నాయర్ కాదు. ఆమె పేరులో అక్షరదోషం ఉంది. ఆ పేరు నాయర్ కాదు పంజాబీ నయ్యర్. మమ్దానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని హిందువులన్నీ, యూదులన్నీ అస్సలు పడదు. వీళ్లపై జరిగే దాడులను సమర్థిస్తాడు’’అని మరో నెటిజన్ విమర్శించాడు. హిందూ వ్యతిరేకి? 2020 ఆగస్ట్‌లో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద రామమందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన ఒక హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిహాదీ, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులనుద్దేశిస్తూ మమ్దానీ అసభ్య పదజాలాన్ని వాడారు. గతంలో బీజేపీకి వ్యతిరేక పోస్ట్‌లు పెట్టారు. ‘‘భారత్‌లో బీజేపీ కేవలం హిందుత్వాన్నే ప్రోత్సహిస్తోంది. మన హిందూ ముత్తాతలు ఉర్దూ కవితలను ఇష్టపడితే, ముస్లిం పెద్దలు ఎంతో శ్రద్ధతో గుజరాతీలో భజనలు చేశారు. ఇలాంటి ఘన చరితను బీజేపీ తుడిచిపారేస్తోంది’’అని మమ్దానీ గతంలో ఒక ట్వీట్‌చేశారు. ‘‘ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్‌లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు’’అని గతంలో మరో పోస్ట్ పెట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫొటోను షేర్చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది 400 ఏళ్లపాటు నిలిచిన మసీదు. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండగ చేసుకున్నారు’’అని మరో పోస్ట్ పెట్టారు. ఆధునిక నాగరికతకు నిలయమైన న్యూయార్క్‌కు అవకాశమొస్తే మేయర్‌గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్షధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగడం కష్టమని పలువురు న్యూయార్క్‌వాసులు ఆందోళన వ్యక్తంచేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మీరు భారతీయుడిలా కాదు.. పాకిస్తానీలా కనిపిస్తున్నారు: కంగనా
న్యూఢిల్లీ: న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించగా, కంగనా రనౌత్ సైతం అతని గెలుపును ఉద్దేశిస్తూ మండిపడ్డారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. @మమ్దానీ తల్లి మీరా నాయర్.. భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారత్‌లో పుట్టి పెరిగారు. గుజరాత్‌కు చెందిన మెహ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. మెహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025 కాగా, 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలిచాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.అయితే జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. -
పూర్తిగా కమ్యూనిస్ట్ పిచ్చోడు
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్ ఎన్నికలకు సంబంధించి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో విజయం సాధించిన భారత సంతతి ముస్లిం నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. మమ్దానీ అసలు సిసలైన కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో గురువారం మమ్దానీని విమర్శిస్తూ పలు పోస్ట్లుపెట్టారు. ‘‘ చివరకు జరగకూడనిదే జరిగింది. డెమొక్రాట్లు హద్దు మీరారు. పూర్తిగా కమ్యూనిస్ట్ పిచ్చోడైన జోహ్రాన్ మమ్దానీని ప్రైమరీ ఎన్నికల్లో గెలిపించారు. చూడబోతే ఆయనే నగర కొత్త మేయర్ అయ్యేలా ఉన్నారు. గతంలోనూ న్యూయార్క్ పీఠంపై విప్లవకారులు కూర్చున్నారు. కానీ ఈసారి మమ్దానీ ఎన్నిక హాస్యాస్పదంగా ఉంది. మమ్దానీ గత ర్యాడికల్ నేతలకంటే కూడా విపరీత పోకడలో పయనిస్తున్నాడు. అతను అంత తెలివైనవాడు కాదు. సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలు, వాతా వరణ మార్పులపై ఇతనికి బొత్తిగా అవగాహన లేద నుకుంటా. దమ్ము లేని నేతలంతా కలిసి ఇతడికి మద్దతు పలికారు. గొప్ప యూద సెనేటర్ చుక్ షెమెర్, కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో–కోర్టెజ్ సైతం మమ్దానీపై ప్రశంసల వర్షం కురిపించడం వింతగా ఉంది. మమ్దానీ లాంటి వ్యక్తులను గెలిపించడం చూస్తుంటే మన దేశం నిజంగా తప్పుదారిలో వెళ్తోందని స్పష్టమవుతోంది’’ అని ట్రంప్ వ్యాఖ్యా నించారు. ఎలాగూ తెలివి తక్కువ వాళ్లే గెలుస్తు న్నారు గనుక తక్కువ ఐక్యూ ఉన్న అభ్యర్థులనే డెమొక్రాట్లు ఏ ఎన్నికలకైనా నామినేట్ చేయాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా 33 ఏళ్ల భారత సంతతి వ్యక్తి
అమెరికాలోని న్యూయార్క్ మేయర్ (New York Mayor) అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. న్యూయార్క్‌లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన పోరులో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) గెలుపొందారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆయన విజయం సాధించారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించగా జోహ్రాన్ మమదానీ గెలుపొందారు. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు. ఇంతకు ముందు.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో న్యూయార్క్ ప్రజల నుంచి ఎరిక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసులో జోహ్రాన్ మమదానీ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ జోహ్రాన్ మేయర్‌గా ఎన్నికైతే.. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు.మేయర్ ఎన్నిక ప్రధాన అభ్యర్థులు(ఇప్పటివరకు)జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) – డెమోక్రటిక్ సోషలిస్ట్, డెమోక్రటిక్ ప్రైమరీలో విజయంకర్టిస్ స్లివా (Curtis Sliwa) – రిపబ్లికన్ అభ్యర్థిజిమ్ వాల్డెన్ (Jim Walden) – స్వతంత్ర అభ్యర్థిఎరిక్ అడమ్స్ – ప్రస్తుత మేయర్, స్వతంత్ర అభ్యర్థిజోహ్రాన్ మమదానీ గురించి.. 33 ఏళ్ల రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.Billionaires ke paas already sab kuchh hai. Ab, aapka time aageya.Billionaires already have everything. Now, your time has come. pic.twitter.com/bJcgxzt37S— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 4, 2025


