కమ్యూనిస్ట్‌ను మేయర్‌గా తీసుకొచ్చారు
డెమొక్రాట్లపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
న్యూయార్క్: అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్‌గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దా నిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన చేశారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్‌సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. మియామీలో అమెరికా బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ ప్రసంగించారు.
గత ఏడాది నవంబర్ 5న అమెరికా ప్రజలు తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకు న్నారని, తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ధ రించారని చెప్పారు. కానీ, మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో సార్వభౌమత్వాన్ని కొంత కోల్పో యినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇకపై ఏదైనా జరిగితే తాను చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
న్యూయార్క్‌లో జరిగింది నిజానికి భయానక ఘటన అని అభివర్ణించారు. అలా జరగకూడదని తాను కోరుకున్నానని.. కానీ, జరిగిపోయిందని చెప్పారు. ‘‘న్యూయార్క్‌లో ఉన్న వ్యక్తి పేరు (మమ్దాని) ఏదైనా కావొచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతడు ఎవరైతే నాకేంటి? మహిళల క్రీడల్లో పురుషులు ఆడడం ఎలా ఉంటుందో ఆలోచించండి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
డెమొక్రటిక్ పార్టీ న్యూయార్క్‌లో ఒక కమ్యూనిస్ట్‌ని మేయర్‌గా ప్రతిష్టించిందని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో కమ్యూనిజం ఏనాడూ పనిచేయలేదని గుర్తుచేశారు. సోషలిస్ట్‌ను కాదను కొని అదేస్థానంలో కమ్యూనిస్ట్‌ను తలకెత్తు కోవడం ఏమిటని ప్రశ్నించారు. అమెరికాను కమ్యూనిస్ట్ క్యూబాగా, సోషలిస్ట్ వెనుజులా మార్చడానికి తమ ప్రత్యర్థులు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. క్యూబా, వెనుజులాలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని చెప్పారు.
డెమొక్రాట్లు అతివాదులుగా మారుతున్నారని ఆరోపించారు. కమ్యూనిజం పాలనలో ఉన్న న్యూయార్క్ నుంచి వచ్చేవారితో మియామీ శరణార్థి శిబిరంగా మారిపోతుందేమోనని డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తంచేశారు. కమ్యూనిస్ట్‌లు, మార్క్సిస్ట్‌లు, సోష లిస్ట్‌లు, గ్లోబలిస్ట్‌లతో విధ్వంసమే తప్ప ఒరిగిదేమీ ఉండదని తేల్చిచెప్పారు. తాను అధికా రంలో ఉన్నంత కాలం అమెరికా ఎట్టిపరిస్థితుల్లో కమ్యూ నిస్ట్ దేశంగా మారబోదని ట్రంప్ పేర్కొన్నారు.


