సమయానికి ఆఫీసుకు రాకుంటే శాలరీలో కోతో.. ఉద్యోగం నుంచి తీసేయడమో చూస్తుంటాం. కానీ సమయానికంటే ముందుగానే ఆపీసుకు వస్తే.. శెభాష్ అనాలిగా.. కాస్త ఇంక్రిమెంట్ ఎక్కువేయాలిగా.. కానీ ఆ కంపెనీ అలా చేయలేదు. ఆఫీసు టైముకంటే ముందుగానే వస్తున్న యువతిని ఇంటికి సాగనంపింది. స్పెయిన్‌లోని ఆలకాంటేలో ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే యువతి ప్రతిరోజూ ఉదయం 6.45 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆఫీసుకు వచ్చేది.
వాస్తవానికి ఆమె షిఫ్ట్ ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. కానీ ఆమె అరగంట ముందే రావడం కంపెనీ యజమానికి నచ్చలేదు. 2023లోనే దీనిపై అతడు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె తన అలావాటు మార్చుకోలేదు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని ఆమె కోర్టులో సవాల్ చేసింది. ఆశ్చర్యకరంగా కోర్టు కూడా యాజమాని పక్షానే నిలిచింది. యజమాని వద్దంటున్నా ముందు రావడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టంచేసింది. ఇక్కడ ఉద్యోగి ప్రవర్తన నమ్మకం, విధేయతపై ప్రభావం చూపిందని పేర్కొంది.
సో.. ఆఫీసుకు ముందుగా వెళ్లినా ముప్పే..
సమయానికి వెళ్తే చాలు.. ఏమంటారు?


