అన్న మరణవార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి | Woman dies of heart attack after hearing brother’s death in Warangal | Sakshi
Sakshi News home page

అన్న మరణవార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి

Feb 1 2026 7:46 AM | Updated on Feb 1 2026 7:46 AM

Woman dies of heart attack after hearing brother’s death in Warangal

వరంగల్ జిల్లా: తోడబుట్టిన అన్న మరణించాడనే వార్త విన్న చెల్లెలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం (గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 16వ డివిజన్‌)లో శనివారం జరిగింది. ధర్మారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల లక్ష్మి (35)–వీరేశం దంపతులకు కుమారుడు సిద్ధార్థ, కూతురు సిరి ఉన్నారు. వారు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి వనదేవతలకు మొక్కులు చెల్లించి ఉదయం ఇంటికి తిరిగొచ్చారు. 

లక్ష్మి అన్న ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వడ్డేపల్లి వెంకటేశ్వర్లు (52) ఉదయం 9 గంటలకు అనారోగ్యంతో మృతి చెందాడని అతడి కుమారుడు ఉదయం 11 గంటలకు ఫోన్‌ చేశాడు. లక్ష్మి భర్త వీరేశం ఫోన్‌ తీసుకుని మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఆమె అది విని అక్కడే గుండెపోటు వచ్చి కింద కూలిపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

కాపీ కొడుతూ చిక్కిన బీటెక్‌ విద్యార్థి 
జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రీన్‌ ఇండ్రస్టియల్‌ పార్కులోని ఎన్‌ఎంఐఎంఎస్‌ యూనివర్సిటీలో ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలోని సల్యేంద్రనాగ సైమా కాలనీకి చెందిన రౌనాక్‌రాజ్‌ (20) ఎన్‌ఎంఐఎంఎస్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో జరిగిన సెమిస్టర్‌ పరీక్షలో కాపీ కొడుతూ ఇని్వజిలేటర్‌కు పట్టుబడ్డాడు.

 దీంతో ఆయన జవాబుపత్రాన్ని స్వా«దీనం చేసుకొని రౌనాక్‌రాజ్‌ను పరీక్ష కేంద్రం నుంచి బయటికి పంపించాడు. దీన్ని అవమానంగా భావించిన విద్యార్థి క్యాంపస్‌లోని çహాస్టల్‌ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ కమలాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement