రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన | Ramadan 2026 Moon Sighting Celebrated On This Date | Sakshi
Sakshi News home page

రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన

Feb 5 2026 11:21 AM | Updated on Feb 5 2026 11:30 AM

Ramadan 2026 Moon Sighting Celebrated On This Date

దుబాయ్‌: ఈ ఏడాది పవిత్ర రంజాన్ మాసం ప్రారంభాన్ని నిర్ణయించే క్రమంలో సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ముస్లింలకు కీలక సూచన చేసింది. షాబాన్ నెల 28వ రోజైన ఫిబ్రవరి 17, 2026 సాయంత్రం ఆకాశంలో నెలవంకను చూడాల్సిందిగా కోరింది. ఎవరైనా  నేరుగా లేదా బైనాక్యులర్ల ద్వారా చంద్రుడిని గుర్తిస్తే ముస్లిం పెద్దలకు ఈ సమాచారాన్ని అందించాలని సూచించింది.

అంతర్జాతీయ ఖగోళ కేంద్రం (ఐఏసీ), ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ అందించిన లెక్కల ప్రకారం, ఈ ఏడాది రంజాన్ ప్రారంభంపై స్వల్ప సందిగ్ధత నెలకొంది. ఫిబ్రవరి 18న షాబాన్ నెల ముగిసే అవకాశం ఉందని, ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 19, గురువారం నుంచి యూఏఈతో పాటు పొరుగు దేశాలలో ఉపవాస దీక్షలు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం నెలవంక కనిపిస్తే, ఫిబ్రవరి 19 నుంచి పవిత్ర మాసం అధికారికంగా మొదలవుతుందని ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ పేర్కొంది.

చంద్ర దర్శనం ఆధారంగా రంజాన్ తేదీలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ముఖ్యంగా దక్షిణాసియా (భారత్, పాకిస్తాన్ వంటి దేశాలు), ఉత్తర ఆఫ్రికా దేశాల్లో స్థానిక వాతావరణ పరిస్థితులు, నెలవంక స్పష్టత ఆధారంగా ఒక రోజు ముందుగా లేదా ఆలస్యంగా రంజాన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వైవిధ్యం కేవలం రంజాన్ ప్రారంభానికే కాకుండా, నెల ముగింపులో జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పండుగ) తేదీపై కూడా ప్రభావం చూపుతుంది.

ఈ ఏడాది రంజాన్ మాసం శీతాకాలంలో రావడం విశేషం. భారత్, సౌదీ అరేబియా, యూకే, అమెరికా తదితర దేశాల్లోని ముస్లింలు ఫిబ్రవరి 17 నుంచి ఆకాశం వైపు చంద్రునికోసం ఎదురుచూడనున్నారు. ఫిబ్రవరి 19న తొలి ఉపవాసం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుండగా, అధికారికంగా నెలవంక కనిపించిన వెంటనే వివిధ మసీదుల ద్వారా ప్రకటనలు వెలువడనున్నాయి. ప్రార్థన సమయాలు, ఇఫ్తార్ వేళల కోసం ఆయా దేశాల్లోని స్థానిక కమిటీలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి.

ఇది కూడా చదవండి: భారీ ట్రాఫిక్‌ జామ్‌.. 33 గంటల తర్వాత..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement