ఆకాశంలో అద్భుతం.. చందమామ, శని, నెప్ట్యూన్‌ల అరుదైన కలయిక!. వసంత రాత్రి వెన్నెలలో నక్షత్రాల మధ్య నవ్వు పూస్తే.. జనవరి 23, 2026.. అంటే ఇవాళ రాత్రి ఆకాశంలో ఖగోల అద్బుతం కనువిందు చేయనుంది. చంద్రుడు, శని(శాటర్న్), వరుడు(నెప్ట్యూన్) ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించనున్నాయి. ఈ త్రిగ్రహ సంయోగం (Triple Conjunction) ఒక మధురానుభూతిని అందించబోతోంది. అదే.. కాస్మిక్ స్మైల్!.
చంద్రుడు తన అర్థ ఆకారం పెరిగే క్రమంలో ఉండడం వల్ల(waxing crescent) ఉండటం వల్ల.. ఈ త్రిగ్రహ సంయోగం ఆకాశంలో చిరునవ్వు లాంటి ఆకారాన్ని సృష్టించనుంది. చిరునవ్వు షేప్‌లో చంద్రుడు.. ఆపైన రెండు కళ్ల ఆకారంలో శని, వరుణ గ్రహాలు చెరో పక్క కనిపింనుచన్నాయి. అయితే ఇలా ఏర్పడడానికి కారణం ఉంది.
ఖగోళ శాస్త్రంలో కాంజంక్షన్ అనేది సాధారణమైన విషయం. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖాంశంలో.. అదీ దగ్గరగా కనిపించే సంఘటన. అయితే ఇవాళ రాత్రి ఏర్పడబోయేది కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఈసారి చంద్రుడు శని కంటే కొన్ని డిగ్రీల ఉత్తరంగా వంగడం.. అదే ప్రాంతంలో నెప్ట్యూన్ కూడా కనిపించడం వల్ల ఈ అరుదైన సంయోగం ఏర్పడబోతోంది.

భారత్‌లో చూడొచ్చా?
సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో పశ్చిమం వైపు ఈ దృశ్యం అత్యంత స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం ఖగోళ శాస్త్రజ్ఞులకే కాకుండా.. ఫోటోగ్రాఫర్లకు, ఖగోళ ప్రేమికులందరికీ ఒక మధుర క్షణమనే చెప్పొచ్చు. అయితే.. చంద్రుడు, శని మన కంటికి సులభంగా కనిపించినప్పటికీ.. నెప్ట్యూన్ కాస్త మసకగా ఉండటం వల్ల దాన్ని చూడటానికి టెలిస్కోప్ అవసరం పడొచ్చు.
పసుపు వెలుగులో చంద్రుడు చిరునవ్వు, సంధ్యా సమయం పశ్చిమ దిక్కున.. ఆకాశంలో ఆహ్లాదకరం.. కాస్మిక్ స్మైల్‌గా మంత్రముగ్ధం చేసే క్షణం..
చంద్రుని నవ్వు (Moon–Saturn–Neptune triple conjunction) చాలా అరుదుగా జరుగుతుంది. అలాగని ఇదే మొదటిసారి కాదు. కిందటి ఏడాది జూన్ 19న కూడా ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడి.. ఆకాశంలో “స్మైలీ ఫేస్” లాంటి దృశ్యం కనిపించింది. మళ్లీ ఇవాళ.. ఈ ప్రత్యేక దృశ్యం మనకు దర్శనమివ్వబోతోంది.


