చందమామ చిక్కేదెవరికి? | NASA has overhauled its Artemis moon program 2028 | Sakshi
Sakshi News home page

చందమామ చిక్కేదెవరికి?

Mar 3 2026 5:17 AM | Updated on Mar 3 2026 5:17 AM

NASA has overhauled its Artemis moon program 2028

మానవసహిత ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్న చైనా 

అమెరికాకు పోటీగా పరిశోధనలు ఒక్కసారిగా పెరిగిన అంతరిక్ష పరిశోధనల పోటీ

దశాబ్దాల తర్వాత జాబిల్లిపై అమెరికా దృష్టిసారించిన మరుక్షణమే చైనా సైతం తన అంతరిక్ష పరిశోధనలకు చందమామను కేంద్రస్థానంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్లు, వ్యోమనౌకలు, ల్యాండర్‌లతో రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. 

2028కల్లా చంద్రునిపై ‘ఆర్టిమిస్‌ ప్రోగ్రామ్‌’ద్వారా మానవసహిత ప్రయోగాలను పునరుద్ధరించాలని అమెరికా ప్రణాళికలు రచించింది. ప్రతిరంగంలో అమెరికాతో పోల్చుకుని ఆ దిశగా పావులు కదిపే చైనా ఇప్పుడు శాస్త్ర పరిశోధనలు, అంతరిక్ష వనరులు, దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందడుగు వేస్తోంది. దీంతో ఒక్కసారిగా చంద్రుని కేంద్రంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పోటీకి తెరలేచింది.  

చైనా ఎలా సంసిద్ధమవుతోంది? 
మానవసహిత ప్రయాణాలు సాధ్యమయ్యేలా అత్యంత శక్తివంతమైన లాంగ్‌ మార్చ్‌–10 రాకెట్‌ను చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన తక్కువ కాలానికి ఇంజిన్‌ను పూర్తి లేదా పాక్షిక సామర్థ్యంతో మండించడం(క్రిటికల్‌ స్టాటిక్‌ ఫైర్‌), ప్రయోగశాలలో రాకెట్‌ సామర్థ్యాన్ని పరీక్షించడం(లో ఆలి్టట్యూట్‌ డెమోన్‌్రస్టేషన్‌ టెస్ట్‌)లను విజయవంతంగా పూర్తిచేసింది. 

వ్యోమగాములను మోసుకెళ్లే పునర్‌ వినియోగ క్యాప్సూ్యల్‌ ‘ది మెంగ్‌జోయూ’ను చైనా పరీక్షిస్తోంది. ఈ క్యాపూŠస్‌ల్‌తో డైనమిక్‌ ప్రెషర్‌ విధానంలో వ్యోమగాములు తప్పించుకునే టెస్ట్‌ను విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి వ్యోమనౌక గాల్లోకి లేచేటప్పుడు హఠాత్తుగా అగ్నిప్రమాదం లాంటివి జరిగితే వ్యోమగాములు తప్పించుకునే మ్యాక్స్‌ క్యూ అబోర్ట్‌ టెస్ట్‌నూ విజయవంతంగా పరీక్షించింది. చైనా వ్యోమగాములు(టైకోనాట్స్‌)ను చందమామ ఉపరితలం మీదకు తీసుకెళ్లే తిరిగి కక్ష్యలోకి తీసుకొచ్చే ‘ది లాన్యే లూనార్‌’ల్యాండర్‌నూ చైనా పరీక్షిస్తోంది. 

లాన్యే అంటే చందమామను హత్తుకోవడం. ఈ పదాన్ని మావో జెడాంగ్‌ తన కవితలో తొలిసారిగా ఉపయోగించారు. సిముల్యేషన్‌ సమయంలో ఈ ల్యాండర్‌.. ల్యాండింగ్, టేకాఫ్‌లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తిచేసిందని చైనా ఇటీవలే ప్రకటించింది. చందమామపైకి లాంగ్‌ మార్చ్‌–10 రాకెట్‌ పలు మార్లు ప్రయోగాలకు అనువుగా ప్రయోగవేదికలను విస్తరిస్తున్నారు. లాంచ్‌ప్యాడ్లు, ట్రాకింగ్‌ స్టేషన్లు, అనుబంధ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో హైనాన్‌లోని వెన్‌చాంగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లాంచ్‌సైట్‌లో నిర్మాణపనులు వేగవంతమయ్యాయి. వ్యోమగా ములతో కూడిన డీప్‌–స్పేస్‌ ఆపరేషన్ల కోసం ఇతర కీలక వసతులను అందుబాటులోకి తెస్తున్నారు.

చందమామ మీదకు వెళ్లేది ఎప్పుడు? 
మరో నాలుగేళ్లలో తొలి వ్యోమగాముల బృందాన్ని చందమామ మీద దింపాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ షెడ్యూల్‌ ప్రకారం చకచకా జరుగుతున్నాయని ‘ది చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ’ప్రకటించింది. ‘‘ప్రయోగ పరీక్షలు అన్నీ విజయవంతమవుతూ, మౌలికసదుపాయాల కల్పన పూర్తవుతూ లక్ష్యాన్ని చేరువచేస్తున్నాయి. అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయిని త్వరలో చేరుకోబోతున్నాం’’అని స్పేస్‌ ఏజెన్సీ పేర్కొంది.

ఈ ఏడాది బిజీబిజీ.. 
2026లో బిజీ షెడ్యూల్‌తో చైనా దూసుకుపోతోంది. సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రం ‘తియాన్‌గాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌’కు రెండు సార్లు వ్యోమగాములను పంపనుంది. సరకులను పంపేందుకు ఒక ప్రయోగం చేయనుంది. ఒక టైకోనాట్‌ను ఒక పూర్తి ఏడాదికాలం అక్కడే ఉంచనుంది. తద్వారా సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉంటే ఎలాంటి అనారోగ్యపరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు? అనే అంశంపై అధ్యయనంచేయనుంది. కొత్త మాడ్యూళ్లను తీసుకెళ్లేందుకు హాంకాంగ్, మకావూ నుంచి ఇద్దరు టైకోనాట్స్‌ను అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. పాకిస్తాన్‌ వంటి అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల వ్యోమగాములకు చైనా స్పేస్‌స్టేషన్‌ స్వాగతం పలకనుంది.  

నాసా మిషన్‌లో వచి్చన మార్పులేంటి? 
2027లో దిగువ కక్ష్యలో తొలుత ఒక వ్యోమనౌకను ప్రయోగించనుంది. వాణిజ్య లాం్యడర్లతో అనుసంధానం కోసం రిహార్సల్‌ చేయనుంది. ఈ కమర్షియల్‌ ల్యాండర్లను స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌ సంస్థలు రూపొందిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్టిమిస్‌–2 ప్రాజెక్ట్‌ను అమెరికా చేపట్టనుంది. వ్యోమగాములతో బయల్దేరే వ్యోమనౌక చంద్రుని సమీప కక్ష్యలోకి వెళ్లి అక్కడి నుంచి జాబిలి సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుని స్వల్ప గురుత్వాకర్షణ శక్తినే వడిసెలా వాడుకుని తిరిగి భూమి దిశలో పయనించనుంది. 2027లో ఆర్టిమిస్‌–3 ఆ తర్వాత 2028లో ఆర్టిమిస్‌–4ను అమలుచేయనుంది.  

మళ్లీ చందమామపై దృష్టి ఎందుకు సారించారు? 
చంద్రుని దక్షిణ ధృవంలోని బిలాల్లో ఘనరూప నీరు ఉందని తాజా పరిశోధనలు బలంగా చెబుతున్నాయి. ఈ నీటిని ఉపయోగించుకుని అక్కడ వ్యోమగాముల కోసం స్థిరనివాసాలు ఏర్పాటుచేయాలని అమెరికా భావిస్తోంది. అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఆశిస్తోంది. అరుణ గ్రహంపై యాత్రకు జాబిలిని మజిలీగా మార్చుకోవాలని భావిస్తున్నారు. హీలియం–3 అనే అరుదైన ఐసోటోప్‌ చందమామపై సమృద్దిగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యోమగాములు అక్కడ స్థిరపడ్డాక ఈ ఐసోటోప్‌తో కేంద్రక సంలీన చర్య ద్వారా నిరంతరాయంగా కరెంట్‌ను ఉత్పత్తిచేసి విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement