Artemis program
-
చంద్రునిపైకి మనోడు: ‘ఆర్టెమిస్’ సారథిగా అమిత్ క్షత్రియ
న్యూఢిల్లీ: ఒకప్పుడు హ్యూస్టన్(అమెరికా)లో ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్లను చూసి ఆశ్చర్యపోయిన ఒక భారతీయ సంతతి కుర్రాడు ఇప్పుడు ఏకంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సారధ్యం వహిస్తున్నాడు. మానవుడిని మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు నాసా చేపడుతున్న ఆర్టెమిస్ మిషన్‌ను అమిత్ క్షత్రియ అనే ప్రవాస భారతీయుడు పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, మన దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు.అమిత్ తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. విస్కాన్సిన్ లోని బ్రూక్ ఫీల్డ్ లో జన్మించిన అమిత్.. నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ఉన్న టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో పెరిగాడు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మ్యాథ్‌మెటిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. పెట్రోలియం, మెడికల్ రంగాల్లో పనిచేసిన ఆయన 2008లో యునైటెడ్ స్పేస్ అలయన్స్ ద్వారా నాసా ప్రయాణాన్ని ప్రారంభించాడు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేసిన విశేష అనుభవంతో పాటు, ఆర్టెమిస్-1 మిషన్ లో కూడా అమిత్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది సెప్టెంబర్ లో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులయ్యారు. 1972 నాటి ‘అపోలో 17’ తర్వాత, 2028 నాటికి మనిషిని చంద్రుడిపైకి పంపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ‘ఆర్టెమిస్ 2’ మిషన్ విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత అమిత్ మాట్లాడుతూ చంద్రుడిపైకి వెళ్లే మార్గం సుగమమైంది. కానీ మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అని అన్నారు. సురక్షితమైన అంతరిక్ష ప్రయాణాలకు ఆయన చేసిన కృషికి గాను నాసా అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్ మెడల్‌తో పాటు, వ్యోమగాములు బహూకరించే ప్రతిష్టాత్మక సిల్వర్ స్నూపీ అవార్డును కూడా అమిత్ దక్కించుకున్నారు.ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ! -
ఆర్టెమిస్-2 గ్రాండ్ సక్సెస్...నాసా విడుదల చేసిన (ఫొటోలు)
-
ఆర్టెమిస్-2 గ్రాండ్ సక్సెస్.. భూమికి చేరిన వ్యోమగాములు
చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2 తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.38 గంటలకు క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు.కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో వ్యోమగాముల ఓరియన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. దీంతో పది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. అయితే.. క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి గంటకు 24,000 మైళ్ల వేగంతో ప్రవేశించినప్పుడు విపరీతమైన వేడిని, దాని హీట్ షీల్డ్ సమర్థవంతంగా తట్టుకుంది. మేం నలుగురం సేఫ్ అని ఆర్టెమిస్-2 కమాండర్ వైజ్‌మ్యాన్ ప్రకటించడంతో నాసా మిషన్ కంట్రోల్ సెంటర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 🚨 NASA's Artemis 2 crew capsule has successfully landed back on Earth pic.twitter.com/QJGe93a8UN— Latest in space (@latestinspace) April 11, 2026వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహించాక.. హ్యుస్టన్కు తరలించనున్నారు. అక్కడ కొన్నిరోజులు వాళ్లను పరిశీలనలో ఉంచుతారు. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవసహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్-2 రికార్డు సృష్టించింది. అంతేకాదు.. 21వ శతాబ్దంలో (అపోలో17 మిషన్.. 1972 తర్వాత) చంద్రుడిపైకి జరిపిన తొలి మానవ సహిత యాత్ర ఇదే. నాసా (NASA) చేపట్టిన ఆర్టెమిస్ 2 (Artemis II) మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించారు. కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుడి ఫార్ సైడ్ (అవతలి వైపు) ను దగ్గరగా పరిశీలించడమే కాకుండా, చంద్రుడిపై సూర్యగ్రహణాన్ని కూడా గమనించారు.సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిని లక్ష్యంగా చేసుకుని నాసా జరిపిన ఈ యాత్రలో.. అపోలో మిషన్ల కంటే ఎక్కువ దూరాన్ని చేరుకుని కొత్త రికార్డు సృష్టించారు. నెక్ట్స్ టార్గెట్ అదే.. ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతం కావడంతో.. ఆర్టెమిస్ 3 (Artemis III) మిషన్‌కు ప్రయత్నాలు త్వరలోనే మొదలుపెట్టనుంది నాసా. తదుపరి ప్రయోగాల్లో మానవులను చంద్రుడిపై దించేందుకు, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించబోతున్నారు. -
తొలిసారిగా భూ అస్తమయం!
హూస్టన్: అత్యంత సుదూరాలకు మానవసహిత వ్యోమనౌక మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్ర సృష్టించిన ఆర్టీమిస్–2 ప్రాజెక్ట్ వ్యోమగాములు ఒరియాన్ వ్యోమనౌక నుంచి అరుదైన విషయాలను తమ మదిలో, కెమెరాల్లో నిక్షిప్తంచేసుకుని భూమికి తిరుగు ప్రయాణం ఆరంభించారు. సోమవారం రాత్రి 11.30 గంటలప్పుడు చంద్రుని ఆవలివైపునకు చేరి చరిత్రలో తొలిసారిగా ఏకధాటిగా దాదాపు ఏడుగంటలపాటు చందమామ అవతలివైపు ప్రాంతాలు, బిలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చంద్రతలం నుంచి దాదాపు 6,545 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ వాటి ఫొటోలను వ్యోమగాములు రీడ్ వైస్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కూచ్, జెరెమీ హాన్సెన్ తమ శక్తివంత నికాన్ కెమెరాలు, ఐఫోన్లలో బంధించారు.ఈ ఫొటోలను నాసా విడుదలచేసింది. ఈ సందర్భంగా చంద్రుని అంచు వెనకాల భూమి అస్తమిస్తున్న ఫొటోనూ ఆర్టీమిస్–2 కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ తమ ఒరియాన్ ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్ కిటికీ గుండా తీశారు. ఇదేకాకుండా వ్యోమగాములకు సూర్యునికి మధ్యలో చందమామ అడ్డుగా వచ్చి ఏర్పడిన అత్యంత అరుదైన సూర్యగ్రహం ఉది్వగ్నభరత క్షణాలను సైతం ఆస్ట్రోనాట్స్ తమ కెమెరాల్లో బంధించారు. ఈ చిమ్మచీకట్లో వెనక వైపు నుంచి మెరుస్తూ కన్పించిన బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శనిగ్రహాల ఫొటోలనూ తీశారు. అర్ధశతాబ్దం క్రితం అపోలో12, అపోలో 14 మిషన్‌లో భాగంగా దిగ్గజ వ్యోమగాములు చంద్రునిపై దిగిన ల్యాండింగ్సైట్లనూ వ్యోమగాములు పరిశీలించారు.ఈ సందర్భంగా గతేడాది మరణించిన అపోలో–8 మిషన్‌లో భాగస్వామి, మాజీ వ్యోమగామి జిమ్ లావెల్తో గతంలో రికార్డ్చేయించిన సందేశాన్ని వ్యోమగాములకు నాసా పంపించింది. ‘‘చరిత్రాత్మక రోజు ఇది. ప్రయోగాలు చేస్తూ బిజీగా ఉంటారేమో. అయినాసరే అక్కడి నుంచి అందాలను వీక్షించడం మానకండి’’అని ఆయన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రుని ఆవలివైపు తొలిసారిగా తాము చూసిన ఒక బిలానికి ఇటీవల కన్నుమూసిన తోటి వ్యోమగామి వైస్‌మ్యాన్ భార్య కరోల్ పేరును పెట్టారు. ఈ సందర్భంగా నలుగురు వ్యోమగాములు కంటతడి పెట్టుకున్నారు. -
అదిరిందయ్యా చంద్రం!
‘భూమ్యాస్తమయం’ అంటే... చంద్రుడి క్షితిజ రేఖ కిందికి వాలుతున్న భూమి. చంద్రుడి సమీపం నుంచి చూసినప్పుడు ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుంది. ఆర్టెమిస్-2 మిషన్‌లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాములు చంద్రుడి ఆవలి వైపు నుంచి తొలుత భూమి అస్తమిస్తున్న ఫొటో తీశారు. ఈ భూమ్యాస్తమయంతో ‘ఆరియన్’ వ్యోమనౌక 31 నిమిషాల సేపు తాత్కాలికంగా హూస్టన్ (అమెరికా)లోని మిషన్ కంట్రోల్ సిబ్బందితో సమాచార సంబంధాలు కోల్పోయింది. అప్పుడు వ్యోమనౌక చంద్రుడి ఉపరితలం నుంచి 4,070 మైళ్ల దూరంలో ఉంది. ఇదే సందర్భంలో భూమి నుంచి అత్యంత ఎక్కువ దూరం (4,06,773 కిలోమీటర్లు) ప్రయాణించిన మానవులుగా వ్యోమనౌకలోని నలుగురు వ్యోమగాములూ రికార్డు సృష్టించారు. 1979లో ‘అపోలో 13’ మిషన్‌లో వ్యోమగాములు భూమి నుంచి 4,00,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆ రికార్డును ఆర్టెమిస్-2 ఆస్ట్రోనాట్లు తాజాగా అధిగమించారు. ఆ వెంటనే.. మరో సుందర ఘట్టం ‘భూమ్యోదయం’ ఆవిష్కృతమైంది. దీంతో భూమితో వ్యోమనౌక కమ్యూనికేషన్స్ పునరుద్ధరణ జరిగింది. 57 ఏళ్ల క్రితం 1968 డిసెంబరులో అమెరికా వ్యోమగామి బిల్ ఆండర్స్ ‘అపోలో 8’ యాత్రలోనూ ‘భూమ్యోదయం’ ఫోటో తీశారు. ‘అపోలో 8’ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ పది ప్రదక్షిణలు చేసినా జాబిల్లిపై దిగకుండానే భూమికి తిరిగొచ్చారు. ఆ సందర్భంగా చంద్రుడి క్షితిజ రేఖ పైకి వస్తున్న ‘ఉదయిస్తున్న భూమి’ ఫొటోను ఆండర్స్ తీశారు. తాజా యాత్రలో ఈ దృశ్యాన్ని కూడా ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు తిలకించారు. అలాగే.. చంద్రుడి ఆవలి వైపు నుంచి 57 నిమిషాలపాటు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వారు వీక్షించారు. సూర్యుడు, చంద్రుడు, ‘ఆరియన్’ వ్యోమనౌక... ఈ మూడూ ఒకే సరళరేఖ పైకి రావడంతో ఈ సూర్యగ్రహణం సంభవించింది. ప్రస్తుతం వ్యోమగాములు భూమికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వారి ‘ఆరియన్’ కేప్సూల్ ఈ నెల 10వ తేదీన (శుక్రవారం) అమెరికా కాలమానం (ఈడీటీ- ఈస్టర్న్ డేలైట్ టైమ్) ప్రకారం రాత్రి 8:07 గంటలకు... అంటే భారత కాలమానం ప్రకారం 11వ తేదీన (శనివారం) ఉదయం 5:37 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని శాన్ డియాగో తీరప్రాంతంలో పారాచూట్ల సాయంతో నెమ్మదిగా పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. రికవరీ టీమ్స్ వారిని క్షేమంగా భూమిపైకి పట్టుకొస్తాయి.:::జమ్ముల శ్రీకాంత్Credits: Forbes, Phys.org -
రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఆర్టిమిస్–2 బృందం
హూస్టన్: చందమామను చుట్టేసి వచ్చేందుకు బయల్దేరిన ఆర్టిమిస్–2 మిషన్ వ్యోమ గాములు ఒరియాన్ వ్యోమనౌక ద్వారా మరో అరుదైన రికార్డ్‌ను సృష్టించారు. భూమి నుంచి అత్యంత దూరం వెళ్లిన వ్యోమగా ములుగా సరికొత్త చరిత్ర లిఖించారు. 1970 సంవత్సరంలో అపోలో–13 ప్రాజెక్ట్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు భూమి నుంచి దూరంగా 2,48,655 మైళ్లు ప్రయాణించారు. ఇప్పుడు ఒరియాన్ వ్యోమనౌకలోని నలుగు రు వ్యోమగాములు రీడ్ వైస్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కూచ్, జెరెమీ హాన్సెన్ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.26 గంటలకు అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించి పాత రికార్డ్‌ను చెరిపేశారు. ఒరియాన్ వ్యోమనౌక 2,52,760 మైళ్లదూరం వెళ్లడం విశేషం. ఒరియాన్ వ్యోమనౌక అలాగే ప్రయాణం కొనసాగిస్తూ యూటర్న్ తీసుకుంటూ భారతకాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక 4.17 గంటలకు చంద్రుని ఆవలివైపునకు చేరుకుంటుంది. దీంతో టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఉన్న నాసా మిషన్ కంట్రోల్ కేంద్రంతో వ్యోమగాములకు 40 నిమిషాలపాటు సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలో చంద్రుని ఆవలివైపు ప్రాంతాలను వ్యోమగాములు కెమెరాలతో బంధించనున్నారు. చంద్రుని ఆవలివైపు బిలాలను మానవుడు చూడటం ఇదే తొలిసారి కానుంది. చంద్రుని ఆవలివైపు ప్రాంతాలను ఏడుగంటలపాటు పరిశీలించే సువర్ణావకాశం వ్యోమగాములకు దక్కనుంది. 4.37 గంటలకు చంద్రునికి అత్యంత సమీపానికి, అంటే 6,550 కిలోమీటర్ల ఎత్తుకు వ్యోమనౌక చేరుకుంటుంది. మరిన్ని ఫొటోలు తీశాక వ్యోమగాములు ఫ్లై–బై కొనసాగిస్తూ భూమికి తిరుగుప్రయాణం ఆరంభించనున్నారు. -
ఆర్టెమిస్-2: 40 నిమిషాలు భూమితో వ్యోమనౌక సంబంధాలు కట్!
నాసా ‘ఆర్టెమిస్-2’ చంద్రయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నలుగురు ఆస్ట్రోనాట్స్ ‘ఆరియన్’ వ్యోమనౌకలో ప్రత్యేకంగా తయారుచేసిన నాలుగు అద్దాల కిటికీల్లోంచి బయటికి అంతరిక్షంలోకి తొంగిచూస్తుంటే... భూమి దూరంగా జరిగిపోతూ చిన్నదిగా కనిపిస్తోంది. నెలరాజు, వెన్నెలరాజు చంద్రుడేమో మెల్లగా దగ్గరికొస్తూ ఎదురుగా పరిమాణం పెరిగిపోయి పెద్దగా దర్శనమిస్తున్నాడు. వ్యోమగాములు జాబిల్లిని చేరుకునే క్రమంలో మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తయింది.సోముడు అంటే చంద్రుడు. నేడు సోమవారం. మండే అంటే మూన్ డే! వారంలోని ఏడు దినాల్లో చంద్రుడికి అంకితమైన రోజు ఇది. ఇదే రోజున హలో... అని పలకరిస్తూ సోముడి చెంతకు చేరబోతున్నారు నలుగురు వ్యోమగాములు. బ్రిటిష్ సమ్మర్ టైమ్ (బీఎస్టీ) ప్రకారం సోమవారం రాత్రి 23.47 గంటలకు అంటే... భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున 4.17 గంటలకు వ్యోమగాములు చంద్రుడి వెనుక/ఆవలి వైపునకు వెళతారు. ఆ సమయంలో వ్యోమనౌకతో భూమ్మీది గ్రౌండ్ కంట్రోల్ కొనసాగించే రేడియో, లేజర్ సిగ్నల్స్, సమాచార సంబంధాలను స్వయంగా చంద్రుడే అడ్డుకుంటాడు. ఇంచుమించు 40 నిమిషాలపాటు వ్యోమనౌకతో, అందులోని వ్యోమగాములతో మనకు సమాచార సంబంధాలు తెగిపోతాయి. అంతరిక్షపు నిశీధిలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ వారు ఒంటరి బహుదూరపు బాటసారులుగా మిగిలిపోతారు! దృష్టినంతటినీ వారు జాబిల్లిపైనే కేంద్రీకరించే సమయం ఇది. ఫొటోలు తీస్తూ, చంద్రుడి జియాలజీని అధ్యయనం చేస్తూ, అద్భుతాన్ని ఆస్వాదించే పనిలో నిమగ్నమవుతారు. ఇటు భూమ్మీద నాసా సిబ్బంది మనోధైర్యాన్ని ఇది రవ్వంత బలహీనపరిచే సమయం. 40 నిమిషాలే అయినా ఆ కొద్ది వ్యవధి ప్రశాంతంగా గడిచిపోయి ‘ఆరియన్’ వ్యోమనౌకతో తమకు సమాచార సంబంధాల పునరుద్ధరణ జరిగే వరకు నాసా సిబ్బందికి ఆందోళన తప్పదు. ప్రయాణం ముందుకుసాగి, వ్యోమనౌకపై చంద్రుడి ఛాయ తొలగిపోయి, దాన్నుంచి మళ్లీ సంకేతాలను అందుకోవడం మొదలైతేనే నాసా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటుంది. నైరుతి ఇంగ్లాండులో కార్న్‌వాల్ లోని గూన్ హిల్లీ ఎర్త్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన భారీ యాంటెన్నా... వ్యోమనౌక ‘ఆరియన్’ సంకేతాలను స్వీకరించి వాటిని నాసా ప్రధాన కార్యాలయానికి చేరవేస్తోంది. కాగా, భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.30 గంటలకు ‘ఆరియన్’ వ్యోమనౌక చంద్రుడికి 41 వేల మైళ్ల దూరంలో ఉంది.- జమ్ముల శ్రీకాంత్ (Credits: NASA, ESA, BBC, The Guardian) -
ఆర్టిమిస్–2 సిబ్బందికి... చవులూరించే రుచులు!
వాషింగ్టన్: అంతరిక్షంలో భారరహిత స్థితిలో ఉన్నప్పుడు భూమ్మీద మాదిరిగా నచ్చిన ఆహారాలు తినేందుకు వీలుపడదు. పాలు ఒలికిపోయి వ్యోమనౌక అంతటా గాల్లో చక్కర్లు కొట్టొచ్చు. బిస్కెట్, బ్రెడ్‌ను కొరికితే విడిపోయే చిన్నపాటి ముక్కలు పైకి లేచి కంట్లో పడొచ్చు. వైర్ల మధ్య ఇరుక్కుని షాట్సర్క్యూట్కు దారితీయొచ్చు. అందుకే వ్యోమగాములు ద్రవ ఆహారాలను పూర్తిగా పక్కన పెడతారు. ఘనరూప ఆహార పదార్థాలనే తీసుకెళ్తారు. ఒరియాన్ వ్యోమనౌకలో బయల్దేరిన ఆర్టిమిస్–2 వ్యోమగాములు సైతం ఈసారి విభిన్న ఆహార పదార్థాలు, వంటకాలను తమతోపాటు తీసుకెళ్లారు. ఆయా ఆహారపదార్థాల జాబితాను ఆర్టిమిస్ మిషన్ ఆదివారం బయటపెట్టింది. కాఫీ, గ్రీన్ టీ, మ్యాంగ్–పీచ్ స్మూతీ, చాక్లెట్ బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్, వెనిలా బ్రేక్‌ఫాస్ట్ డ్రింగ్, లెమనేడ్, యాపిల్ సిడార్, పైనాపిల్ డ్రింక్, కోకా, స్ట్రాబెర్రీ బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్‌లను వెంటతీసుకెళ్లారు. గట్టిపడిన గోధుమ రొట్టెలు, గోధుమ బ్రెడ్, వెజిటబుల్ క్వికే, వాల్నట్స్, మామిడి సలాడ్, బ్లూబెర్రీలు, బాదం, జీడిపప్పు, బ్రకోలీ, వేయించిన గ్రీన్ బీన్స్, మ్యాకరోలీ అండ్ చీజ్, ఫ్రూట్ సలాడ్, బట్టర్‌నట్ స్క్వాష్, కాలీఫ్లవర్లనూ వెంట తీసుకెళ్లారు. ఐదు రకాల హాట్ సాస్‌లు, మాపిల్ సిరప్, చాక్లెట్, పీనట్ బటర్, స్పైసీ మస్టర్డ్, స్ట్రాబెర్రీ జామ్, తేనె, బాదంపొడి, దాల్చిన చెక్క, గొడ్డు మాంసంలనూ వెంట తీసుకెళ్లారు. వీటన్నింటినీ థర్మోస్టెబిలైజ్ విధానంలో మార్చారు. దీంతో ఎన్నేళ్లయినా పాడవకుండా ప్యాకెట్లలో అలాగే ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రేడియోధార్మికతకు గురికాకుండా దళసరి రక్షణాత్మక ప్యాకెట్లలో ఆహారాన్ని ప్యాక్‌చేస్తారు. బ్రీఫ్‌కేస్ పరిమాణంలో ఒక ఓవెన్లాంటి పరికరం సైతం వీళ్లకోసం తయారుచేశారు. ఇందులో కొద్దిసేపు ఉంచితే ఆహారం వేడెక్కుతుంది. దీంతో వేడివేడిగా ఆహారం తినేయొచ్చు. పోషకాల లోపం లేకుండా అన్ని రకాల ఆహారపదార్థాలను ఒరియాన్ వ్యోమనౌకలో మెనూను సిద్ధంచేయడం విశేషం. -
రికార్డుకు చేరువలో ఆర్టిమిస్–2
వాషింగ్టన్: ఒక రోజంతా భూమి చుట్టూ తిరిగిన ఆర్టీమిస్–2 ప్రాజెక్ట్ వ్యోమగాములు ఇప్పుడు చంద్రుని దిశగా సగం దూరం ప్రయాణించి తదుపరి రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు సంసిద్ధమయ్యారు. 1970 ఏడాదిలో అపోలో–13 మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు భూమి నుంచి 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించారు. ఇప్పుడీ రికార్డ్‌ను ఆర్టీమిస్–2 వ్యోమగాములు బద్దలుకొట్టనున్నారు. ఓరియాన్ వ్యోమనౌకలోని నలుగురు వ్యోమగాములు శనివారం నాటికే భూమి నుంచి చంద్రుని దిశగా 1,36,080 మైళ్లు ప్రయాణించారు. త్వరలోనే చంద్రుడిని దాటి దాదాపు 2,52,000 మైళ్లదూరం వెళ్లనున్నారు. తద్వారా అపోలో–13 వ్యోమగాముల రికార్డ్‌ను వీళ్లు 53 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరిపేయనున్నారు. తర్వాత వీళ్ల వ్యోమనౌక యూటర్న్ తీసుకుని భూమి దిశగా ప్రయాణం కొనసాగిస్తుంది. ఆర్టిమిస్–2లో భాగంగా తమ దేశీయుడు వెళ్తుండటంపై కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంబరాలు చేసుకుంది. కెనడా వ్యోమగామి జెరిమీ హన్సెన్తో క్యూబెన్ నగరంలోని కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అధ్యక్షురాలు లీసా క్యాంప్‌బెల్ మాట్లాడి అభినందించారు. -
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్‌లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్‌తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్‌లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్‌గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్‌కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్‌లో అసైన్డ్ క్రూ బ్రాంచ్‌కు చీఫ్‌గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్‌కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్‌గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్‌కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్‌కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్‌లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్‌ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్‌ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్‌లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్‌లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్‌లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
అర్ధశతాబ్దం తర్వాత జాబిలి దిశగా..
కేవ్ కనావరల్(ఫ్లోరిడా): అంతరిక్ష యాత్రలకు జాబిలిని మజిలీగా మార్చుకునే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్–2 ప్రయోగం నేడు ఫ్లోరిడాలోని కేప్ కనావరల్లోని ‘కెన్నడీ అంతరిక్ష కేంద్రం’వేదికగా జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.24 గంటలకు(భారతకాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 3.54 గంటలకు) నలుగురు వ్యోమగాములతో 32 అంతస్తుల ఎత్తయిన ‘స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్’నింగిలోకి దూసుకుపోనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారమే ప్రారంభించారు. దాదాపు 53 ఏళ్ల తర్వాత చందమామ సంబంధ ప్రాజెక్ట్‌కు నాసా శ్రీకారంచుట్టి శరవేగంగా ఆచరణలో పెట్టింది.అంతా సవ్యంగా సాగితే అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్ వైస్‌మ్యాన్(కమాండర్), విక్టర్ గ్లోవర్(పైలట్), క్రిస్టినా కూచ్(మహిళా మిషన్ స్పెషలిస్ట్), జెరిమీ హాన్సెన్లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు.కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్‌లో పయనించనున్నారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచి్చనా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు బుధవారం ప్రయోగంచేపట్టేందుకు రంగంసిద్ధమైంది. -
చందమామ చిక్కేదెవరికి?
దశాబ్దాల తర్వాత జాబిల్లిపై అమెరికా దృష్టిసారించిన మరుక్షణమే చైనా సైతం తన అంతరిక్ష పరిశోధనలకు చందమామను కేంద్రస్థానంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్లు, వ్యోమనౌకలు, ల్యాండర్లతో రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. 2028కల్లా చంద్రునిపై ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ద్వారా మానవసహిత ప్రయోగాలను పునరుద్ధరించాలని అమెరికా ప్రణాళికలు రచించింది. ప్రతిరంగంలో అమెరికాతో పోల్చుకుని ఆ దిశగా పావులు కదిపే చైనా ఇప్పుడు శాస్త్ర పరిశోధనలు, అంతరిక్ష వనరులు, దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందడుగు వేస్తోంది. దీంతో ఒక్కసారిగా చంద్రుని కేంద్రంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పోటీకి తెరలేచింది. చైనా ఎలా సంసిద్ధమవుతోంది? మానవసహిత ప్రయాణాలు సాధ్యమయ్యేలా అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్–10 రాకెట్‌ను చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన తక్కువ కాలానికి ఇంజిన్‌ను పూర్తి లేదా పాక్షిక సామర్థ్యంతో మండించడం(క్రిటికల్ స్టాటిక్ ఫైర్), ప్రయోగశాలలో రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షించడం(లో ఆలి్టట్యూట్ డెమోన్‌్రస్టేషన్ టెస్ట్)లను విజయవంతంగా పూర్తిచేసింది. వ్యోమగాములను మోసుకెళ్లే పునర్ వినియోగ క్యాప్సూ్యల్ ‘ది మెంగ్జోయూ’ను చైనా పరీక్షిస్తోంది. ఈ క్యాపూŠస్ల్తో డైనమిక్ ప్రెషర్ విధానంలో వ్యోమగాములు తప్పించుకునే టెస్ట్‌ను విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి వ్యోమనౌక గాల్లోకి లేచేటప్పుడు హఠాత్తుగా అగ్నిప్రమాదం లాంటివి జరిగితే వ్యోమగాములు తప్పించుకునే మ్యాక్స్ క్యూ అబోర్ట్ టెస్ట్‌నూ విజయవంతంగా పరీక్షించింది. చైనా వ్యోమగాములు(టైకోనాట్స్)ను చందమామ ఉపరితలం మీదకు తీసుకెళ్లే తిరిగి కక్ష్యలోకి తీసుకొచ్చే ‘ది లాన్యే లూనార్’ల్యాండర్నూ చైనా పరీక్షిస్తోంది. లాన్యే అంటే చందమామను హత్తుకోవడం. ఈ పదాన్ని మావో జెడాంగ్ తన కవితలో తొలిసారిగా ఉపయోగించారు. సిముల్యేషన్ సమయంలో ఈ ల్యాండర్.. ల్యాండింగ్, టేకాఫ్‌లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తిచేసిందని చైనా ఇటీవలే ప్రకటించింది. చందమామపైకి లాంగ్ మార్చ్–10 రాకెట్ పలు మార్లు ప్రయోగాలకు అనువుగా ప్రయోగవేదికలను విస్తరిస్తున్నారు. లాంచ్ప్యాడ్లు, ట్రాకింగ్ స్టేషన్లు, అనుబంధ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో హైనాన్లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్సైట్లో నిర్మాణపనులు వేగవంతమయ్యాయి. వ్యోమగా ములతో కూడిన డీప్–స్పేస్ ఆపరేషన్ల కోసం ఇతర కీలక వసతులను అందుబాటులోకి తెస్తున్నారు.చందమామ మీదకు వెళ్లేది ఎప్పుడు? మరో నాలుగేళ్లలో తొలి వ్యోమగాముల బృందాన్ని చందమామ మీద దింపాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ షెడ్యూల్ ప్రకారం చకచకా జరుగుతున్నాయని ‘ది చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ’ప్రకటించింది. ‘‘ప్రయోగ పరీక్షలు అన్నీ విజయవంతమవుతూ, మౌలికసదుపాయాల కల్పన పూర్తవుతూ లక్ష్యాన్ని చేరువచేస్తున్నాయి. అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయిని త్వరలో చేరుకోబోతున్నాం’’అని స్పేస్ ఏజెన్సీ పేర్కొంది.ఈ ఏడాది బిజీబిజీ.. 2026లో బిజీ షెడ్యూల్‌తో చైనా దూసుకుపోతోంది. సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రం ‘తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్’కు రెండు సార్లు వ్యోమగాములను పంపనుంది. సరకులను పంపేందుకు ఒక ప్రయోగం చేయనుంది. ఒక టైకోనాట్ను ఒక పూర్తి ఏడాదికాలం అక్కడే ఉంచనుంది. తద్వారా సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉంటే ఎలాంటి అనారోగ్యపరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు? అనే అంశంపై అధ్యయనంచేయనుంది. కొత్త మాడ్యూళ్లను తీసుకెళ్లేందుకు హాంకాంగ్, మకావూ నుంచి ఇద్దరు టైకోనాట్స్ను అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. పాకిస్తాన్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల వ్యోమగాములకు చైనా స్పేస్‌స్టేషన్ స్వాగతం పలకనుంది. నాసా మిషన్‌లో వచి్చన మార్పులేంటి? 2027లో దిగువ కక్ష్యలో తొలుత ఒక వ్యోమనౌకను ప్రయోగించనుంది. వాణిజ్య లాం్యడర్లతో అనుసంధానం కోసం రిహార్సల్ చేయనుంది. ఈ కమర్షియల్ ల్యాండర్లను స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు రూపొందిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్టిమిస్–2 ప్రాజెక్ట్‌ను అమెరికా చేపట్టనుంది. వ్యోమగాములతో బయల్దేరే వ్యోమనౌక చంద్రుని సమీప కక్ష్యలోకి వెళ్లి అక్కడి నుంచి జాబిలి సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుని స్వల్ప గురుత్వాకర్షణ శక్తినే వడిసెలా వాడుకుని తిరిగి భూమి దిశలో పయనించనుంది. 2027లో ఆర్టిమిస్–3 ఆ తర్వాత 2028లో ఆర్టిమిస్–4ను అమలుచేయనుంది. మళ్లీ చందమామపై దృష్టి ఎందుకు సారించారు? చంద్రుని దక్షిణ ధృవంలోని బిలాల్లో ఘనరూప నీరు ఉందని తాజా పరిశోధనలు బలంగా చెబుతున్నాయి. ఈ నీటిని ఉపయోగించుకుని అక్కడ వ్యోమగాముల కోసం స్థిరనివాసాలు ఏర్పాటుచేయాలని అమెరికా భావిస్తోంది. అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఆశిస్తోంది. అరుణ గ్రహంపై యాత్రకు జాబిలిని మజిలీగా మార్చుకోవాలని భావిస్తున్నారు. హీలియం–3 అనే అరుదైన ఐసోటోప్ చందమామపై సమృద్దిగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యోమగాములు అక్కడ స్థిరపడ్డాక ఈ ఐసోటోప్‌తో కేంద్రక సంలీన చర్య ద్వారా నిరంతరాయంగా కరెంట్‌ను ఉత్పత్తిచేసి విద్యుత్ అవసరాలను తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చందమామను చుట్టొచ్చేలా...
మనిషి చివరిసారిగా చంద్రునిపై దిగి 50 ఏళ్లు దాటింది. అర్ధ శతాబ్ది సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్–2 స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ శనివారం కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ ప్యాడ్‌కు చేరింది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 6న ఆర్టెమిస్–2 ప్రయోగం జరగనుంది. దీనిద్వారా నలుగురు వ్యోమగాములు ఓరియాన్ స్పేస్ క్యాప్సూల్‌లో చంద్రుని చుట్టూ పరిభ్రమించి రానున్నారు. అమెరికాకు చెందిన నాసా కమాండర్ రీడ్ వైజ్మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జెరెమీ హన్సెన్ ఈ మిషన్‌లో భాగస్వాములు. ఓరియాన్ క్యాప్సూల్ భూ దిగువ కక్ష్యను దాటుకుని చంద్రుని చుట్టూ ఓ రౌండ్ కొట్టి భూమికి 10 రోజుల అనంతరం తిరిగి వస్తుంది. తద్వారా వ్యోమగాములు చంద్రునిపై దిగేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేస్తుంది. అనంతరం ఆర్టెమిస్–3 మిషన్‌లో భాగంగా వ్యోమగాములను చంద్రునిపై దింపాలన్నది నాసా లక్ష్యం. ఆర్టెమిస్–2 ఫలితాన్ని బట్టి 2027లో గానీ, 2028లో గానీ ఈ మిషన్‌ను చేపట్టే అవకాశముంది. నాసా చివరిసారిగా 1972లో అపోలో 17 మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వ్యోమగాములను పంపింది. ఆర్టెమిస్–2 ఎస్ఎల్ఎస్ రాకెట్ ఎత్తు ఏకంగా 100 మీటర్లు కావడం విశేషం. ఇక దీని బరువు 5,000 టన్నులు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్‌లైన్!
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్ సౌత్‌పోల్ ఆక్సిజన్ పైప్‌లైన్ (ఎల్–ఎస్పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.ఎలా చేస్తారు?చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి→ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను
కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి. -
చంద్రుడి మీదకు మనుషులు.. నాసా కీలక ప్రకటన!
చంద్రుని వద్దకు మనుషుల్ని పంపేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్న నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్న నలుగురు ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ప్రారంభించింది. ఈ శిక్షణ 18 నెలల పాటు కొనసాగనుందని నాసా తెలిపింది. 51 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపిస్తున్న నాసా ఆర్టెమిస్ 2పై పనిచేస్తుంది. ఇందులో భాగంగా జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లును సురక్షితంగా తీసుకెళ్లే ఓరియన్ క్యాప్య్సూల్, స్పేస్ లాంచ్ సిస్టం గురించి ఈ 18 నెలల కఠిన శిక్షణలో వివరించనుంది. వీటితో పాటు సిస్టమ్‌లను ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం కూడా నేర్చుకుంటారు. ఆరోహణ, కక్ష్య, తీరం, ఎంట్రీ ఫేజ్‌లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి’ అనే అంశం గురించి ఆస్ట్రోనాట్స్ వీరికి వివరించనుంది. View this post on Instagram A post shared by NASA (@nasa) -
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుని చెంతకు ఓరియాన్
వాషింగ్టన్: పలు అడ్డంకుల్ని, బాలారిష్టాల్ని దాటుకుంటూ నాసా ఇటీవల ఎట్టకేలకు ప్రయోగించిన ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రున్ని చేరి చరిత్ర సృష్టించింది. అది చందమామకు వెనకవైపుగా 128 కిలోమీటర్ల సమీపానికి వెళ్లిందని నాసా సోమవారం ప్రకటించింది. దీన్ని అత్యంత కీలకమైన ముందడుగుగా అభివర్ణించింది. నాసా విడుదల చేసిన వీడియోల్లో చంద్రుడు అతి భారీ పరిమాణంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాడు. అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్ రాకెట్ ద్వారా గత బుధవారం ఓరియాన్‌ను నాసా ప్రయోగించడం తెలిసిందే. ఇందులో మనుషులను పోలిన మూడు డమ్మీలను పంపారు. 50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో మిషన్ తర్వాత చంద్రున్ని చేరిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇది విజయవంతమైతే తర్వాతి మిషన్‌లో మనుషులను, 2024లో మూడో మిషన్‌లో వ్యోమగాములను పంపనున్నారు. సరిగ్గా ఓరియాన్ చంద్రునికి అత్యంత సమీపానికి చేరిన సమయానికే అరగంట పాటు దాన్నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఒక దశలో గందరగోళం నెలకొంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే శుక్రవారం మరో ఇంజన్‌ను పేల్చడం ద్వారా ఓరియాన్‌ను చంద్రుని కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశపెడతారు. చంద్రునిపై దిగకుండా దాదాపు వారంపాటు అది కక్ష్యలోనే గడుపుతుంది. అనంతరం డిసెంబర్ 11న భూమికి తిరిగి రావాలన్నది ప్లాన్. -
ఆర్టెమిస్ 1 ప్రయోగం నిలిపివేత.. ప్రకటించిన నాసా
తల్లాహస్సీ: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్‌డౌన్ గడియారం నిలిపివేసింది నాసా. అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఇవాళ(సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది. ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్లు ఇంజిన్లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది. అంతకు ముందు కౌంట్‌డౌన్ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా. The countdown clock is on a hold at T-40 minutes. The hydrogen team of the @NASA_SLS rocket is discussing plans with the #Artemis I launch director. Operational commentary continues at https://t.co/z1RgZwQkWS. pic.twitter.com/5J6rHVCe44 — NASA (@NASA) August 29, 2022 The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom — NASA (@NASA) August 29, 2022 ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. శాశ్వత ఆవాసాల కోసం.. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా.. ఆర్టెమిస్-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి. ఇదీ చదవండి: ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?


