రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఆర్టిమిస్‌–2 బృందం | Artemis II astronauts break Apollo record on historic moon flyby | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఆర్టిమిస్‌–2 బృందం

Apr 7 2026 4:29 AM | Updated on Apr 7 2026 4:29 AM

Artemis II astronauts break Apollo record on historic moon flyby

చంద్రుని ఆవలి వైపు అరుదైన ఫొటోల సేకరణ

హూస్టన్‌: చందమామను చుట్టేసి వచ్చేందుకు బయల్దేరిన ఆర్టిమిస్‌–2 మిషన్‌ వ్యోమ గాములు ఒరియాన్‌ వ్యోమనౌక ద్వారా మరో అరుదైన రికార్డ్‌ను సృష్టించారు. భూమి నుంచి అత్యంత దూరం వెళ్లిన వ్యోమగా ములుగా సరికొత్త చరిత్ర లిఖించారు. 1970 సంవత్సరంలో అపోలో–13 ప్రాజెక్ట్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు భూమి నుంచి దూరంగా 2,48,655 మైళ్లు ప్రయాణించారు. 

ఇప్పుడు ఒరియాన్‌ వ్యోమనౌకలోని నలుగు రు వ్యోమగాములు రీడ్‌ వైస్‌మ్యాన్, విక్టర్‌ గ్లోవర్, క్రిస్టినా కూచ్, జెరెమీ హాన్సెన్‌ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.26 గంటలకు అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించి పాత రికార్డ్‌ను చెరిపేశారు. ఒరియాన్‌ వ్యోమనౌక 2,52,760 మైళ్లదూరం వెళ్లడం విశేషం. ఒరియాన్‌ వ్యోమనౌక అలాగే ప్రయాణం కొనసాగిస్తూ యూటర్న్‌ తీసుకుంటూ భారతకాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక 4.17 గంటలకు చంద్రుని ఆవలివైపునకు చేరుకుంటుంది. దీంతో టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఉన్న నాసా మిషన్‌ కంట్రోల్‌ కేంద్రంతో వ్యోమగాములకు 40 నిమిషాలపాటు సంబంధాలు తెగిపోతాయి.

 ఆ సమయంలో చంద్రుని ఆవలివైపు ప్రాంతాలను వ్యోమగాములు కెమెరాలతో బంధించనున్నారు. చంద్రుని ఆవలివైపు బిలాలను మానవుడు చూడటం ఇదే తొలిసారి కానుంది. చంద్రుని ఆవలివైపు ప్రాంతాలను ఏడుగంటలపాటు పరిశీలించే సువర్ణావకాశం వ్యోమగాములకు దక్కనుంది. 4.37 గంటలకు చంద్రునికి అత్యంత సమీపానికి, అంటే 6,550 కిలోమీటర్ల ఎత్తుకు వ్యోమనౌక చేరుకుంటుంది. మరిన్ని ఫొటోలు తీశాక వ్యోమగాములు ఫ్లై–బై కొనసాగిస్తూ భూమికి తిరుగుప్రయాణం ఆరంభించనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement