'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..! | Maharashtra bus driver gets shoulder ride from colleague as farewell | Sakshi
Sakshi News home page

'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!

Apr 6 2026 4:40 PM | Updated on Apr 6 2026 4:48 PM

Maharashtra bus driver gets shoulder ride from colleague as farewell

మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య మైత్రి బంధం చూడగానే షోలో మూవీలోని స్నేహితుల్లా కనిపిస్తారు. అచ్చం అందులో జై, వీరుల (ధర్మేంద్ర, అమితా బచ్చన్‌) మధ్య సాగే పాటలోని సీన్‌ గుర్తుకొస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ఒక డిపొ నుంచి షేర్‌ చేసి ఒక వీడియో అందరి మనసులను హత్తుకుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర రవాణా డ్రైవర్‌కు భావోద్వేగభరితమైన వీడ్కోలు చిత్రీకరించంది. ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య చోటు చేసుకున్న దృశ్యం. అచ్చం యువకుల మాదిరిగా ఆ సహోద్యోగి పదవీవిరమణ చేస్తున్న తన స్నేహితుడైన బస్సు డ్రైవర్‌ని భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యం అందర్నీ కదిలిస్తుంది. 

వృద్ధాప్యం మనసుకే గానీ..ఆప్యాయతను వ్యక్తం చేయడానికి కాదు అన్నట్లుగా తన సహోద్యోగిని ఎత్తుకుని వీడ్కోలు పలుకుతున్న కమనీయ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. అది పనిలో తన చివరి రోజు కావడంతో, ఆ వీడ్కోలు అతను అక్కడ నిర్మించుకున్న జీవితానికి ఒక వేడుకగా మారింది. చూడటానికి చిన్న పనే అయినే ఎన్నో ఏళ్లుగా ఉ‍న్న స్నేహబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్న జ్ఞాపకాలను ప్రతిబింబించింది. 

అది సరిగ్గా షోలో మూవీలోని జై వీరుల ఐకానిక్‌ స్నేహం గుర్తు చేసింది. ముఖ్యంగా దోస్తీ పాటలో ధర్మేంద్ర అమితా బచ్చన్‌ భుజాలపై కూర్చునే ప్రసిద్ధ సన్నివేశం గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్‌ ఉద్యోగానికే కానీ, ఏర్పడిన స్నేహాలు, జ్ఞాపకాలు జీవితాంతం నిలిచిపోతాయని ఈ సన్నివేశం చెబుతోంది కదూ..!.

 

(చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement