వాష్టింగన్: హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేదంటే ఇరాన్‌లో విధ్వంసం తప్పదని హూంకరిస్తున్నారు. అయితే, ట్రంప్ బెదరింపుల్ని ఇరాన్ ఖాతరు చేయడం లేదు. హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెబుతోంది. అమెరికాను ఏకాకిని చేస్తూ.. పశ్చిమాసియా యుద్ధంలో తమకు భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు తమకు అండగా ఉన్నాయని తెలిసేలా సెటైరికల్ ట్వీట్లు వేస్తోంది.
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తున్నాయి. ఆ ట్వీట్‌లలో
దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో
ట్రంప్:హర్మూజ్ జలసంధిని తెరవండి అని ఇరాన్ అడుగుతుంటే మిగిలిన దేశాలు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశాయని అర్ధం వచ్చేలా ట్వీట్‌లలో హైలెట్ చేశాయి.
భారత్: హర్మూజ్ జలసంధిని మూసేశారా?
పాకిస్థాన్: హర్మూజ్ జలసంధిని మూసేసింది.
రష్యా: విచిత్రంగా ఉంది…
దక్షిణాఫ్రికా: లేదు హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది
ఫ్రాన్స్: అబ్బే అలా ఏం లేదే. హర్మూజ్ జలసంధిని చూస్తుంటే మాకు అలా అనిపించడం లేదే
చైనా: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. మేం ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం’అని ట్వీట్‌లలో పేర్కొంది.
బల్గేరియా ఎంబసీ: ‘టేక్ ఇట్ ఈజీ టైగర్, కీప్ యువర్ కూల్’ అంటూ ట్రంప్‌ను ఎగతాళి చేసింది
జింబాబ్వే ఎంబసీ: “ట్రంప్, నాతో మాట్లాడు. మాకు చాలా బోర్‌గా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించింది
మరికొన్ని ఎంబసీలు ‘తాళాలు పోయాయి’ అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాయి.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్ ట్వీట్లలో భారత్, చైనా వంటి దేశాల పేర్లు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉంది. తాను ఒంటరిగా లేనని, తనకు మిత్రదేశాలు అండగా ఉన్నాయని ప్రపంచానికి సంకేతం ఇవ్వడమే. అమెరికాను ఏకాకిగా చూపించడమే కాకుండా, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉందని అంతర్జాతీయ సమాజానికి ధైర్యం చెప్పడమేనని వారు విశ్లేషిస్తున్నారు.
హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇక్కడి ఉద్రిక్తతలు చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి.
ఇటీవలి అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి చేశాయి. సౌదీ అరేబియా, కువైట్, యుఎఈ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. టెహ్రాన్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
ఇరాన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తే, మరోవైపు ప్రపంచానికి “మా వెనుక ఇతర దేశాలు ఉన్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే సందేశాన్ని పంపుతున్నాయి. అయితే, హర్మూజ్ వివాదం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trump: "Open the Strait of Hormuz!"
India: "Is it closed?"
Pakistan: "Closed?"
Russia: "Strange…"
South Africa: "but it's Open, of course"
France: "Doesn't look like it…"
China: "Open… we just passed through! 🚢😏"
Trump: 🙁 https://t.co/vnNc1EQy54— Iran Embassy SA (@IraninSA) April 5, 2026


