ఇజ్రాయెల్‌పై భీకర దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్‌ | Iran carried out major missile attacks in central Israel and Tel Aviv | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై భీకర దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్‌

Apr 6 2026 7:20 PM | Updated on Apr 6 2026 7:40 PM

Iran carried out major missile attacks in central Israel and Tel Aviv

జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యర్థులు శత్రు స్థావరాలపై దాడులు జరపడం పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి జనావాసాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది.

సోమవారం ఇరాన్ భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌తో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ నివేదించింది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. రోజంతా పదేపదే సైరన్‌లు మోగుతుండగా, రాబోయే మరిన్ని దాడుల గురించి అధికారులు హెచ్చరిస్తూ, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement