షార్ట్‌ ఫిలిం షూట్‌ : మునిగిపోయిన ముగ్గురు స్నేహితులు | Three Friends Drownin Short Film shoot At kadapa In AP | Sakshi
Sakshi News home page

షార్ట్‌ ఫిలిం షూట్‌ : మునిగిపోయిన ముగ్గురు స్నేహితులు

Apr 6 2026 1:09 PM | Updated on Apr 6 2026 2:27 PM

Three Friends Drownin Short Film shoot At kadapa In AP

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షూట్‌ కోసం వెళ్లిన ముగ్గురు యవకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు   ఇన్‌స్టా ద్వారా పరిచమయ్యారు.  షార్ట్‌ ఫిలిమ్స్‌పై ఆసక్తితో ఒకరికొకరు సాయం చేసుకోవాలని భావించారు. ఈనేపథ్యంలో కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నది వద్ద షార్ట్ ఫిలిం చిత్రీకరించేందుకు వెళ్లారు.  అక్కడ షూట్‌ చేస్తుండగా, ముగ్గురూ అనూహ్యంగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే గాలింపు  చర్యలు  చేపట్టారు. ఇందులో భాగంగా హరిబాబు(25), హర్షవర్ధన్(22) మృత దేహాలను వెలికితారు. కృష్ణచైతన్య(20) ఆచూకీ  కోసం గాలింపు ముమ్మరం చేశారు.  

ఇదీచదవండి: 5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement