ఇరాన్‌కు లాస్ట్‌ ఛాన్స్‌.. డెడ్‌లైన్ గడువు పొడిగింపు? | Trump extends Iran deadline | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు లాస్ట్‌ ఛాన్స్‌.. డెడ్‌లైన్ గడువు పొడిగింపు?

Apr 6 2026 3:44 PM | Updated on Apr 6 2026 4:00 PM

 Trump extends Iran deadline

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవకపోతే విధ్వంసకర రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాజాగా ఇరాన్‌ డెడ్‌లైన్ గడువును మరో రోజు పొడిగించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు మరింత భీకరంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్‌ జలసంధిని క్లోజ్‌ చేసి ఇరాన్‌  చమురు సంక్షోభానికి కారణమయ్యింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో హర్మూజ్‌ని తెరవాలని లేకపోతే వినాశనమేనని ఇరాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

ఏప్రిల్‌ 5 నిన్న (ఆదివారం) 48 గంటల్లో హర్మూజ్‌ తెరవాలని లేకపోతే దాడులతో విరుచుకపడతామన్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో రోజు గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. ట్రంప్ కొత్త డెడ్‌లైన్ ప్రకారం GMT బుధవారం ఉదయం 12 గంటల వరకూ డెడ్‌లైన్ పొడిగించినట్లు సమాచారం. దీంతో ఇరాన్‌కు హర్మూజ్‌ జలసంధిని తెలవడానికి మరో రోజు గడువు లభించినట్లయింది..

అయితే ట్రంప్‌ ఈ విషయమై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌తో మాట్లాడినట్లు సమాచారం. ఒకవేళ డెడ్‌లైన్ ముగిసేలోపు వారు హర్మూజ్‌ను తెరవకపోతే వారి దేశంలో విద్యుత్‌ ప్లాంట్లు, వంతెనలు ఏమి ఉండవని హెచ్చరించారు. ఒకవేళ వారు గనుక ఈ సమయంలో చర్చలు జరపకపోతే వారి దేశంలోని మౌళిక సదుపాయాలను ధ్వంసం చేసి చమురును స్వాధీనం చేసుకుంటామన్నారు.

కాగా ట్రంప్ ఆంక్షలను ఇరాన్‌ బేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్‌ గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ టెహ్రాన్‌ తరపునుంచి ఏటువంటి ప్రకటనలు వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement