ఇరాన్‌కు మరో షాక్‌.. మజీద్‌ ఖదేమీ మృతి | IRGC intelligence chief Majid Khademi dies | Sakshi
Sakshi News home page

Majid Khademi : ఇరాన్‌కు మరో షాక్‌.. మజీద్‌ ఖదేమీ మృతి

Apr 6 2026 2:39 PM | Updated on Apr 6 2026 5:08 PM

IRGC intelligence chief Majid Khademi dies

టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్‌ ఐఆర్‌జీసీ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మజీద్‌ ఖదేమీ మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో ఖదేమీ మృతి చెందినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌ ‌జజీరా తెలిపింది.  

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ అధికారికంగా మజీద్‌ మరణాన్ని ధృవీకరించింది. ఐఆర్‌జీసీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ పలు కథనాలు ప్రసారం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడుల్లో తమ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మజీద్‌ మరణించారని ఐఆర్‌జీసీ ప్రకటించింది. మజీద్‌ గత ఐదేళ్లుగా ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చీఫ్‌గా పనిచేశారు. ఈ కాలంలో విదేశీ శక్తుల చొరబాటును అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ టీవీ కథనాలు కూడా ప్రస్తావించాయి.

ఇరాన్ కు మరో బిగ్ షాక్..IRGC ఇంటలిజెన్స్ చీఫ్ ఖదేమీ మృతి

Advertisement
 
Advertisement
Advertisement