మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్‌: స్టాలిన్‌ | Tamil Nadu CM Stalin Satirical Comments On BJP | Sakshi
Sakshi News home page

మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్‌: స్టాలిన్‌

Apr 6 2026 7:11 AM | Updated on Apr 6 2026 8:37 AM

Tamil Nadu CM Stalin Satirical Comments On BJP

విరుధునగర్‌/విరాలిమలై: 2026 అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే మేనిఫెస్టో సూపర్‌ స్టార్‌ వంటిదని ఆ పార్టీ చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అభివర్ణించారు. హామీలు ఎవ్వరైనా ఇస్తారు కానీ, తమ పార్టీ ఇచ్చిన హామీలను మాత్ర మే ప్రజలు నమ్ముతారని చెప్పారు. విరుధునగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో స్టాలిన్‌ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ‘అన్ని వయస్సుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు.. ఇలా అందరూ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఇష్టపడతారు. ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే నేను విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో 2026 ఎన్నికల క్షేత్రంలో సూపర్‌స్టార్‌ లాంటిది’అని ఆయన చెప్పారు. ‘‘విశ్వసనీయత కలిగిన వ్య క్తుల వాగ్దానాలనే ప్రజలు విశ్వసిస్తారు. ఇతరులు ఏది చెప్పినా జనం నమ్మరు’’ అని స్టాలిన్‌ అన్నారు.

ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించాలి: ఉదయనిధి
తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం ఈ ఎన్నికల్లో ఢిల్లీ టీమ్‌ను ఇంటికి సాగనంపాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రజలను కోరారు. ఈ ఎన్నికలను ఢిల్లీ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరిగే యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. డీఎంకే కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడును నియంత్రించేందుకు ఢిల్లీ ఉపయోగిస్తున్న రిమోట్‌కంట్రోల్‌ను పగుల గొట్టాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement