ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గానా.. | Fitness Trainer Shares Her 90-Year-Old Grandpa's Workout Routine | Sakshi
Sakshi News home page

ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గానా..

Apr 6 2026 10:47 AM | Updated on Apr 6 2026 11:07 AM

Fitness Trainer Shares Her 90-Year-Old Grandpa's Workout Routine

20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్‌ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్‌ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో చూద్దామా..!.

ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయిన జెన్నిఫర్‌ మార్టిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. 

ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్‌గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్‌నెస్‌ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్‌కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్‌కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్‌ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్‌లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. 

మెషీన్లు, డంబెల్స్‌ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు.

 

(చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్‌ ఇవాళ ఏకంగా యూట్యూబ్‌లో..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement