ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్‌లో ఇండస్ట్రీ | Tamil TV actress Subashini found dead at Chennai home industry in shock | Sakshi
Sakshi News home page

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్‌లో ఇండస్ట్రీ

Apr 6 2026 3:48 PM | Updated on Apr 6 2026 4:14 PM

Tamil TV actress Subashini found dead at Chennai home industry in shock

సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం  (Subashini Balasubramaniyam) చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అయ్యప్పంతంగళ్‌లో గల తన నివాసంలో సుభాషిణి మృతదేహం లభ్యమైంది.  సుభాషిణి ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే  కెరీర్‌లో ఎదుగుతున్న నటి ఆకస్మిక మరణం తోటి నటీ నటుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రాథమిక పోలీసు విచారణలో ఇది ఆత్మహత్యగా తేలింది. వీడియో కాల్‌లో తన భర్తతో జరిగిన వ్యక్తిగత వాగ్వాదం తర్వాత ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణను కొన సాగిస్తున్నారు. ఆమె మరణం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆమె నటనకు సంబంధించిన క్లిప్‌లు, జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా, ఆయా పాత్రలకు సహజత్వాన్ని తీసుకువచ్చిన గొప్ప నటిగా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంక నుండి తమిళ టెలివిజన్ వరకు సుభాషిణి ప్రయాణం ఆశయం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతుందంటూ సంతాపం వెలిబుచ్చారు. ఆమె జీవితం విషాదాంతమైనప్పటికీ,   మంచి నటిగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటున్నారు.

ఎవరీ సుభాషిణి 
సుభాషిణి స్వస్థలం శ్రీలంక. తమిళ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనే ఆశయంతో ఆమె చెన్నైకి వలస వచ్చింది. ఎంతోమంది వర్ధమాన నటుల మాదిరిగానే,  ఎన్నోకష్టనష్టాలకోర్చి అవకాశాలను దక్కించుకుంది.  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని  సక్సెస్‌ఫుల్‌ కరియర్‌కు బాటలు  వేసుకుంది. నటనపై ఆమెకున్న పట్టుదల, అభిరుచి, ఆమెలోని భావోద్వేగాలను, తెరపై అద్భుతంగా ప్రదర్శించే పాత్రలను సంపాదించడంలో సహాయ పడ్డాయి. ముఖ్యంగా 'కాయల్' సీరియల్‌తో ఆమెకు మంచి బ్రేక్‌త్రూ లభించింది, ఇందులో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ టీవీలో స్థిరమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ఈ షో, ఆమెను వెలుగులోకి తీసుకువచ్చి, అనేక తమిళ కుటుంబాలలో సుపరిచితమైన  నటి నిలిపింది.  ఈ సీరియల్‌లో సుభాషిణి పాత్ర చిత్రణ ద్వారా అనేక ప్రశంసలను అందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement