ఎమ్మెల్యే మాధవి రెడ్డికి బిగ్‌ షాక్‌.. | School Students Questioned TDP MLA Madhavi Reddy In Kadapa | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాధవి రెడ్డికి బిగ్‌ షాక్‌..

Apr 6 2026 11:07 AM | Updated on Apr 6 2026 11:22 AM

School Students Questioned TDP MLA Madhavi Reddy In Kadapa

సాక్షి, కడప: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక తనిఖీలు చేసి హడావుడి చేద్దామనుకున్న పచ్చ పార్టీకి ఎమ్మెల్యే.. అక్కడున్న పరిస్థితి చూసి అవాక్కయ్యారు. చేసేదేమీ లేక ముక్కుమూసుకుని బయటకు వచ్చేశారు. దీంతో, కూటమి సర్కార్‌ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో ఓ ప్రజా ప్రతినిధి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన నియోజకవర్గంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగా కడప నగరం ముతరాసుపల్లి జడ్పీ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితులను చూసి మాధవి రెడ్డి జడుసుకున్నారు. స్కూల్‌లోని బాత్‌రూమ్‌లను చూసి ఒక్కసారిగా ముక్కు మూసుకుని బయటకు వచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వ పాలనలో పాఠశాలల పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు.

 అనంతరం, మండుటెండలో మట్టిలో పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి అవాక్కయ్యారు. నాణ్యత లేని భోజనం పెట్టడాన్ని చేసి ఎమ్మెల్యే ఖంగుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు.. ప్రతి రోజూ భోజనం బాగాలేదు అని మాధవికి చెప్పడం మరో విశేషం. ఇలా ఒక్కో సమస్యను విద్యార్థులు.. మాధవి రెడ్డి దృష్టికి తీసుకురావడంతో రివర్స్‌లో ఆమెకే షాక్‌ తగిలినట్టు అయ్యింది. దీంతో, చెప్పేది, చేసేదీ ఏమీ లేక మాధవి రెడ్డి అక్కడి నుంచి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్‌పై నెటిజన్లు మండితున్నారు. రాష్ట్రంలో స్కూల్స్‌ నిర్వహణపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement